News March 18, 2025

బాపట్ల: బయోమెట్రిక్‌ ఆధారంగా సచివాలయ సిబ్బందికి జీతాలు

image

సచివాలయ సిబ్బంది బయో మెట్రిక్ ద్వారా హాజరు వేయడం లేదని బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకట మురళి తెలిపారు. సిబ్బంది అందరూ బయోమెట్రిక్ ద్వారా హాజరు నమోదు చేయాలన్నారు. హాజరు నమోదులో జిల్లా వెనుకబడి ఉందని ఆయన తెలిపారు. ఏప్రిల్ మాసము నుంచి జీతభత్యాలు బయోమెట్రిక్ హాజరు ఆధారంగా చెల్లిస్తామన్నారు. సచివాలయ సిబ్బంది తప్పనిసరిగా ఉదయం సాయంత్రం రెండు పూటలా బయోమెట్రిక్ ద్వారా హాజరు నమోదు చేయాలని ఆయన అన్నారు.

Similar News

News November 10, 2025

క్యాన్సర్ చికిత్సలో గేమ్ ఛేంజర్‌గా TAR-200

image

ఎలాంటి చికిత్సకు లొంగని మూత్రాశయ క్యాన్సర్ కణతులను(Tumors) TAR-200 అనే ఔషధ పరికరం 3 నెలల్లోనే కరిగించి అద్భుతాలు సృష్టిస్తోంది. ఇది పాత పద్ధతిలా కాకుండా, ప్రతి 3 వారాలకు నిరంతరంగా కీమో మందును విడుదల చేస్తుంది. మూత్రాశయం తొలగించాల్సిన అవసరం లేకుండా 82% మంది రోగులకు ఈ చికిత్సతో క్యాన్సర్ నయమైంది. క్యాన్సర్ చికిత్సలో గేమ్ ఛేంజర్‌గా నిలిచిన దీనికి FDA ఆమోదం తెలిపింది.

News November 10, 2025

భద్రాచలంలో భక్తుల రద్దీ

image

భద్రాచలంలోని శ్రీసీతారామచంద్ర స్వామి వారి ఆలయం ఆదివారం, సోమవారం భక్తులతో కిటకిటలాడింది. కార్తీక మాసం కావడం, వరుస సెలవు దినాలు రావడంతో భక్తులు అధిక సంఖ్యలో భద్రాద్రికి తరలివచ్చారు. ఆదివారం ఉదయం నుంచి రామాలయంలోని క్యూలైన్‌లో కిక్కిరిశాయి. ఉచిత దర్శనానికి రెండు గంటలు, శీఘ్ర దర్శనానికి ఒక గంట సమయం పట్టింది. భక్తుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని దేవస్థానం అధికారులు ముందస్తుగా ఏర్పాట్లు చేశారు.

News November 10, 2025

చిత్తూరు పోలీసులకు 43 ఫిర్యాదులు

image

చిత్తూరు జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. బాధితుల నుంచి ఎస్పీ తుషార్ డూడీ వినతులు స్వీకరించారు. 43 ఫిర్యాదులు అందినట్లు అధికారులు తెలిపారు. చట్ట ప్రకారం వాటిని విచారించి బాధితులకు సత్వరమే న్యాయం చేసేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఎస్పీ ఆదేశించారు.