News April 7, 2025
బాపట్ల: బాల్య వివాహలను అరికట్టాలి- కలెక్టర్

బాల్య వివాహాలను పూర్తిగా అరికట్టాలని బాపట్ల జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి ప్రజలకు పిలుపునిచ్చారు. సోమవారం ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ర్యాలీని కలెక్టర్ పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. జన్మనిస్తూ ఏ తల్లి చనిపోకూడదని, అదేవిధంగా జన్మిస్తూ ఏ శిశువు మరణించకూడదని ఆయన అన్నారు.
Similar News
News November 3, 2025
శివయ్య భక్తులకు TGRTC శుభవార్త

కార్తీక పౌర్ణమి వేళ అరుణాచలం వెళ్లాలనుకునే భక్తులకు TGRTC శుభవార్త చెప్పింది. నేరుగా హైదరాబాద్ నుంచి అరుణాచలం వెళ్లేందుకు ప్రత్యేక సర్వీసులను ప్రవేశపెట్టింది. HYD దిల్షుక్నగర్ నుంచి అరుణాచలం గిరి ప్రదక్షిణ మార్గం వరకు ఈ బస్సులను నడుపుతోంది. హైదరాబాద్ నుంచి అరుణాచలంకు నేరుగా చేరుకోవడానికి సరైన రవాణా వ్యవస్థ లేకపోవడంతో భక్తుల సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకుంది. ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకోవచ్చు.
News November 3, 2025
ఎవరి గురించి చెడుగా మాట్లాడకండి..

పుట్టపర్తి సత్యసాయి బాబా సూక్తులు..
★ అందరిలోనూ దైవాన్ని చూడు. నువ్వు ఎవరికి నమస్కరించినా, అది చివరకు ఆ భగవంతుడికే చేరుతుంది
★ ఎప్పుడూ ఎవరి గురించి చెడుగా మాట్లాడకూడదు
★ నామస్మరణ చేయండి, మీ నాలుక మధురం అవుతుంది, మీకు మంచి కలుగుతుంది
★ కేవలం అన్నం కోసం కాక, ధర్మం కోసం బతకండి.
News November 3, 2025
కర్నూలు పవర్ ప్రాజెక్టుకు ₹7500 కోట్ల REC ఫండింగ్

AP: బ్రూక్ఫీల్డ్ క్లీన్ ఎనర్జీ సంస్థ ‘ఎవ్రెన్’ కర్నూలు జిల్లాలో ఏర్పాటుచేసే పవర్ ప్రాజెక్టుకు కేంద్ర సంస్థ REC ₹7500 కోట్లు అందించనుంది. ప్రైవేటు ప్రాజెక్టులో ఆర్ఈసీ అందించే అతిపెద్ద ఫండింగ్ ఇదే. 1.4 GW హైబ్రిడ్ ప్రాజెక్టుకు బ్రూక్ఫీల్డ్ ₹9910 కోట్లు వ్యయం చేయనుంది. ఎవ్రెన్ సంస్థలో 51.49% వాటా ఉన్న ఆ సంస్థ ఏపీలో మొత్తంగా 3 WG పవర్ ప్రాజెక్టుకు వీలుగా ప్రణాళికలు సిద్ధం చేసింది.


