News March 23, 2025

బాపట్ల: బీసీ కార్పొరేషన్ రుణాలకు గడువు పొడిగింపు 

image

బాపట్ల జిల్లాలోని స్వయం ఉపాధి రుణాల దరఖాస్తుల గడువు పొడిగించినట్లు బీసీ కార్పొరేషన్ ఈడీ వెంకటేశ్వరరావు తెలిపారు. కలెక్టరేట్ కార్యాలయంలో శనివారం ఆయన మాట్లాడుతూ.. స్వయం ఉపాధి రుణాల దరఖాస్తుకు ఈనెల 10వ తేదీ నుంచి 22వ తేదీ వరకు ఇచ్చిన గడువును.. మరో మూడు రోజులు పాటు పొడిగించామన్నారు. ఈ నెల 25వ తేదీ వరకు అవకాశం కల్పిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.

Similar News

News November 27, 2025

స్మోకింగ్, డ్రింకింగ్ కంటే ఒత్తిడి డేంజర్ అని తెలుసా?

image

స్మోకింగ్, డ్రింకింగ్ కంటే వేగంగా ఆయువును ఒత్తిడి హరిస్తుందని ఓ ఆర్థోపెడిక్ సర్జన్ తెలిపారు. ‘ఒత్తిడి కేవలం మానసిక సమస్య కాదని చాలామందికి తెలియదు. అది పూర్తి బాడీకి సంబంధించినది. ఒత్తిడికి గురైనప్పుడు శరీరం కార్టిసాల్, అడ్రినలిన్ రిలీజ్ చేస్తుంది. వెన్నునొప్పి, తలనొప్పి, పళ్లు కొరకడం, కండరాలు పట్టేయడం వంటి వాటికీ ఒత్తిడే కారణం’ అని చెప్పారు. 7-8 గంటల నిద్రతోనే ఒత్తిడిని ఎదుర్కోగలమన్నారు.

News November 27, 2025

NZB: జి.జి.కళాశాలలో కృత్రిమ మేధపై జాతీయ సదస్సు

image

స్థానిక గిరిరాజ్ ప్రభుత్వ కళాశాలలో భౌతిక శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో “కృత్రిమ మేధ యుగంలో విజ్ఞాన శాస్త్రాలకు ఉన్న అవకాశాలు & అవరోధాలు”అంశంపై జరుగుతున్న జాతీయ సదస్సును TU వైస్ ఛాన్స్‌లర్ ప్రొ. టి. యాదగిరి రావు, కాకతీయ యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్స్‌లర్ ప్రొ.ఆర్.సాయన్న, ప్రిన్సిపల్ డా.పి.రామ్మోహన్ రెడ్డి, సమన్వయకర్త రామకృష్ణ, ప్రారంభించి, సావనీర్ ఆవిష్కరించారు.

News November 27, 2025

ములుగు జిల్లాలో ‘ఆమె’ ఓట్లే అధికం..!

image

ములుగు జిల్లాలోని 10 మండలాల్లో మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. జిల్లాలో మొత్తం 2,29,159 ఓటర్లు ఉండగా, అందులో 1,10,838 మంది పురుషులు, 1,18,299 మంది మహిళలు ఉన్నారు. పురుషుల కంటే 7,461 మంది మహిళలు అధికంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. అత్యధికంగా మంగపేటలో 19,913 మహిళా ఓటర్లు ఉండగా, అత్యల్పంగా కన్నాయిగూడెంలో 5,085 మహిళా ఓటర్లు ఉన్నారు.