News April 16, 2025

బాపట్ల: బెట్టింగ్‌ నిర్వహణపై కఠినంగా వ్యవహరిస్తాం: ఎస్పీ

image

ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లు నిర్వహిస్తున్న నేపథ్యంలో బాపట్ల జిల్లా పోలీసు అధికారులు హోటల్స్, లాడ్జీలు, రిసార్ట్స్, దాబాలు, రెస్టారెంట్లపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఎస్పీ తుషార్ డూడి మాట్లాడుతూ.. బెట్టింగ్‌కు తావులేని జిల్లాగా బాపట్లను మార్చేందుకు ఇది భాగమని పేర్కొన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు హోటల్స్‌ వంటి ప్రదేశాలను వేదికగా చేసుకునే వారిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.

Similar News

News November 23, 2025

ములుగు: మహిళా సంఘాలకు మంత్రి శుభవార్త

image

ములుగు జిల్లా మహిళా సంఘాలకు మంత్రి సీతక్క శుభవార్త చెప్పారు. రానున్న మేడారం జాతర సమయంలో వేలాది మంది భక్తులు జాతరకు వస్తారని, ఈ సందర్భంగా జాతీయ రహదారికి ఇరువైపులా ఫుడ్ కోర్ట్స్, దుకాణాలు, వ్యాపారాలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా అనుమతి ఇచ్చిందన్నారు. ఈ అవకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సీతక్క కోరారు.

News November 23, 2025

భారీ జీతంతో SIDBIలో ఉద్యోగాలు

image

స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(<>SIDBI<<>>) 14 కన్సల్టెంట్ క్రెడిట్ అనలిస్ట్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు DEC 4 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి CA, CMA ఉత్తీర్ణులు అర్హులు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 28ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. జీతం నెలకు రూ.లక్ష చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://www.sidbi.in/

News November 23, 2025

రేపటి ప్రజావాణి కార్యక్రమం రద్దు: జనగామ కలెక్టర్

image

కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం రేపు రద్దు చేస్తున్నట్లు జనగామ కలెక్టర్ రిజ్వాన్ బాష షేక్ తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో, అలాగే స్వయం సహాయక సంఘ సభ్యులకు చీరల పంపిణీ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు విధి నిర్వహణలో ఉన్నందున రేపటి గ్రీవెన్స్ సెల్ రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ విషయాన్ని జిల్లా ప్రజలు గమనించి సహకరించాలని కోరారు.