News February 23, 2025
బాపట్ల: ‘భూగర్భ జలాల పెరుగుదలకు చర్యలు చేపట్టాలి’

భూగర్భ జలాల పెరుగుదలకు అంగన్వాడీ కేంద్రాల వద్ద ఇంకుడు గుంతలు నిర్మించాలని బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకట మురళి తెలిపారు. భూగర్భ జలాల పెరుగుదలపై సంబంధిత శాఖల అధికారులతో శనివారం బాపట్ల కలెక్టరేట్ ఛాంబర్లో సమీక్ష నిర్వహించారు. జలవనరులను సంరక్షించడానికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని కలెక్టర్ చెప్పారు. ప్రభుత్వ భవనాలపై కురిసే వర్షపు నీరు నేరుగా ఇంకుడు గుంతల్లోకి వెళ్లేలా చూడాలన్నారు.
Similar News
News November 21, 2025
టుడే టాప్ న్యూస్

*పదోసారి బిహార్ CMగా నితీశ్ కుమార్ ప్రమాణం.. పాల్గొన్న PM మోదీ, అమిత్ షా, CM చంద్రబాబు
*అక్రమాస్తుల కేసులో HYD నాంపల్లి CBI కోర్టుకు హాజరైన AP మాజీ సీఎం జగన్
* కేంద్రమంత్రి బండి సంజయ్, మాజీమంత్రి కేటీఆర్‌పై నమోదైన కేసులు కొట్టేసిన హైకోర్టు
* ఫార్ములా ఈ-రేస్ కేసులో KTRపై ఛార్జ్‌షీట్ దాఖలకు గవర్నర్ అనుమతి
* పార్టీ ఫిరాయింపు MLAల అనర్హత పిటిషన్లపై స్పీకర్ గడ్డం ప్రసాద్ విచారణ పూర్తి
News November 21, 2025
ప్రథమ స్థానంలో ఖిల్లావనపర్తి సబ్ స్టేషన్

NPDCL ఉత్తమ పనితీరులో ఖిల్లావనపర్తి సబ్ స్టేషన్ రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచింది. ట్రాన్స్‌కో సెక్షన్ పరిధిలోని వినియోగదారుల సమస్యల పరిష్కారం, కొత్త ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు, వ్యవసాయ కనెక్షన్ల సమస్యలను వేగంగా పరిష్కరించింది. దీంతో 16 జిల్లాల్లోని NPDCL 354 సెక్షన్ల పరిధిలో ఖిల్లావనపర్తి SS ఫస్ట్ ర్యాంకు సాధించింది. దీంతో NPDCL కార్యాలయంలో SE గంగాధర్ సబ్ స్టేషన్ AE మహిపాల్‌ని అభినందించారు.
News November 21, 2025
HYD: జలమండలి పేరిట సైబర్ నేరగాళ్ల కొత్త మోసం

జలమండలి అధికారుల పేరుతో సైబర్ మోసగాళ్లు రిటైర్డ్ ఉద్యోగి ప్రభాకర్‌ను నమ్మించి ఫోన్లో APK ఫైల్ ఇన్స్టాల్ చేయించి బ్యాంకు ఖాతా నుంచి రూ.2.30 లక్షలు దోచుకున్నారు. కేన్ నంబర్ మార్చాలి, లేదంటే నీటి సరఫరా నిలిపేస్తామని బెదిరించారు. డబ్బు ఇతర ఖాతాలకు వెళ్లినట్లు చిలకలగూడ పోలీసులు గుర్తించి కేసు నమోదు చేశారు. నల్లా బిల్లు పేరిట కొత్త రకమైన మోసాలు పెరుగుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.


