News February 23, 2025

బాపట్ల: భ్రూణ హత్యలకు పాల్పడరాదు

image

మానవ సమాజం మనుగడలో ఆడపిల్లల అవశ్యకత ఉందని, ఎట్టి పరిస్థితుల్లోనూ భ్రూణ హత్యలకు పాల్పడకూడదని బాపట్ల జిల్లా DMHO విజయమ్మ చెప్పారు. శనివారం బాపట్ల కలెక్టరేట్లో డిస్ట్రిక్ట్, సబ్ డిస్ట్రిక్ట్ వైద్యులు స్కానింగ్ కేంద్రాల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ఆడపిల్లలను పుట్టనిద్దాం.. ఎదగనిద్దాం చదవనిద్ధం అనే అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. స్కానింగ్ సెంటర్లు రెన్యువల్ చేయించుకోవాలన్నారు.

Similar News

News November 8, 2025

దొంగ-పోలీస్ గేమ్ ఆడుదామని అత్తను చంపేసింది!

image

AP: దొంగ-పోలీస్ గేమ్ పేరుతో అత్తను కోడలు చంపేసిన ఘటన విశాఖ(D) పెందుర్తిలో జరిగింది. మహాలక్ష్మీ(63), ఆమె కోడలు లలిత మధ్య గొడవలు జరిగేవి. ఈ క్రమంలో ఆమెపై పగ పెంచుకున్న కోడలు దొంగ-పోలీస్ ఆడుదామంటూ అత్త కళ్లకు గంతలతో పాటు కాళ్లు, చేతులు కట్టేసింది. ఆపై పెట్రోల్ పోసి నిప్పంటించింది. దీపం అంటుకొని చనిపోయినట్లు PSకు సమాచారం అందించింది. అనుమానంతో పోలీసులు తమదైన శైలిలో విచారించగా అసలు విషయం బయటపడింది.

News November 8, 2025

మెదక్: ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం

image

చర్చ్ అఫ్ సౌత్ ఇండియా మెదక్ కేథడ్రల్ పాస్టరేట్ కమిటీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. 20 మంది సభ్యుల ఎన్నిక కోసం మొత్తం 60 మంది అభ్యర్థులు(జీఎస్‌పీ, పాస్‌నేట్, ఆల్ఫా ఒమేగా ప్యానెల్‌ల తరపున) పోటీపడ్డారు. 1712 మంది సభ్యులుండగా 1451 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 84.75% పోలింగ్ నమోదైంది. సాయంత్రం ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. అర్ధరాత్రి వరకు ఫలితాలు రానున్నాయి. పోలీస్ బందోబస్త్ ఏర్పాటు చేశారు.

News November 8, 2025

యుద్ధానికి సిద్ధం.. పాక్‌కు అఫ్గాన్ వార్నింగ్

image

పాకిస్థాన్-అఫ్గానిస్థాన్ మధ్య మరోసారి చర్చలు విఫలం అయ్యాయి. తుర్కియే, ఖతర్ మధ్యవర్తిత్వంలో ఇవాళ ఇస్తాంబుల్‌లో జరిగిన శాంతి చర్చలు పురోగతి లేకుండానే ముగిశాయి. పాకిస్థాన్ కారణంగానే ఈ సందిగ్ధత ఏర్పడిందని అఫ్గాన్ ఆరోపించింది. అవసరమైతే తాము యుద్ధానికైనా సిద్ధమని పాక్‌ను తాలిబన్ సర్కార్ హెచ్చరించింది. ఇక నాలుగో విడత చర్చలకు ఎలాంటి ప్రణాళికలు లేవని పాక్ ప్రకటించింది.