News February 23, 2025
బాపట్ల: భ్రూణ హత్యలకు పాల్పడరాదు

మానవ సమాజం మనుగడలో ఆడపిల్లల అవశ్యకత ఉందని, ఎట్టి పరిస్థితుల్లోనూ భ్రూణ హత్యలకు పాల్పడకూడదని బాపట్ల జిల్లా DMHO విజయమ్మ చెప్పారు. శనివారం బాపట్ల కలెక్టరేట్లో డిస్ట్రిక్ట్, సబ్ డిస్ట్రిక్ట్ వైద్యులు స్కానింగ్ కేంద్రాల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ఆడపిల్లలను పుట్టనిద్దాం.. ఎదగనిద్దాం చదవనిద్ధం అనే అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. స్కానింగ్ సెంటర్లు రెన్యువల్ చేయించుకోవాలన్నారు.
Similar News
News March 22, 2025
రోడ్డు ప్రమాద బాధితులకు రూ.6లక్షల పరిహారం: విశాఖ సీపీ

విశాఖ సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రోడ్డు ప్రమాద బాధితుల సహాయక కేంద్రం ద్వారా బాధితులకు శుక్రవారం రూ.6లక్షల పరిహారం అందజేసినట్లు సీపీ శంఖబ్రత బాగ్చి తెలిపారు. ఇటీవల హిట్ రన్ ప్రమాదంలో చనిపోయిన మల్లిపాటి సూర్యనారాయణ, పైల సూరిబాబు, కొట్యాడ సూర్యప్రభ కుటుంబాలకు రూ.2లక్షలు చొప్పున రూ.6లక్షలు అకౌంట్‌లలో డిపాజిట్ చేసినట్లు సీపీ తెలిపారు. ఇప్పటి వరకూ 24 మంది బాధితులకు రూ.15 లక్షలు అందించామన్నారు.
News March 22, 2025
కూటమి ఎమ్మెల్యేలు స్కిట్లు వేసుకోవాల్సిందే: పేర్ని

AP: కూటమి ఎమ్మెల్యేలు స్కిట్లు వేసుకుని బతకాల్సిందేనని YCP నేత పేర్ని నాని ఎద్దేవా చేశారు. త్వరలోనే ప్రజలు వారికి బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని మండిపడ్డారు. ‘మా పార్టీ నేతల అరెస్టులతో జగన్ పరపతి ఏమీ తగ్గలేదు. రెడ్ బుక్ రాజ్యాంగం మమ్మల్ని ఏమీ చేయలేదు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలంటే జగన్‌కే సాధ్యం. ఈ విషయంలో చంద్రబాబు, పవన్.. జగన్ దగ్గర ట్రైనింగ్ తీసుకోవాల్సిందే’ అని ఆయన వ్యాఖ్యానించారు.
News March 22, 2025
రాజమండ్రిలలో P4పాలసీ కార్యక్రమం

P4 పాలసీ కార్యక్రమాన్ని నగరపాలక సంస్థ కమిషనర్ కేతన్ గర్గ్ ఆధ్వర్యంలో రాజమండ్రిలో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. P4 పాలసీ ద్వారా ప్రభుత్వం వెనుకబడిన కుటుంబాలను ప్రత్యక్షంగా దత్తత తీసుకుని వారిని ఆర్థికంగా బలోపేతం చేయడానికి సహాయపడుతుందని అన్నారు. ప్రజల నిజమైన అవసరాలను తీర్చడం, వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే వారి అభివృద్ధికి తోడ్పాటు చేయడం జరుగుతుందని ఆయన అన్నారు.