News October 31, 2024
బాపట్ల: మందు బాబులకు దీపావళి ఆఫర్

మందు బాబులను తమ షాపులకు రప్పించుకునేందుకు నిర్వాహకులు కొత్త ఆఫర్లు ప్రకటిస్తున్నారు. ఈ నేపథ్యంలో దీపావళి సందర్భంగా చెరుకుపల్లి మండలం గుళ్లపల్లిలో ఓ వైన్షాపు వద్ద ఓ ఆఫర్ ప్రకటించారు. రూ.1000 అంతకంటే ఎక్కువ కొనుగోలు చేసిన వారికి శనివారం లాటరీ తీసి 10మంది సభ్యులకు రూ.200విలువ గల బాటిల్ బహుమతిగా ఇస్తున్నట్లు ప్రకటించారు.
Similar News
News November 6, 2025
సాహితీ త్రిముఖుడు డా. పాపినేని శివశంకర్

పాపినేని శివశంకర్ సుప్రసిద్ధ కవి, కథకులు విమర్శకులుగా ప్రసిద్ధి చెందారు. ఆయన్ను ‘సాహితీ త్రిముఖుడు’ అని పిలుస్తారు. కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారం ఆయనకు లభించింది. ఆయన రాసిన కవితా సంపుటి ‘రజనీగంధ’కు 2016లో ఈ ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది. శివశంకర్ గుంటూరు జిల్లా నెక్కల్లు గ్రామంలో జన్మించారు. ఆయన తాడికొండ కళాశాలలో తెలుగు అధ్యాపకుడిగా, ప్రిన్సిపల్గా పనిచేశారు.
News November 6, 2025
గుంటూరు: సీఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన ఎస్పీ

ముఖ్యమంత్రి చంద్రబాబు నవంబర్ 7న గుంటూరులో జరిగే కార్యక్రమాలకు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం ఎస్పీ వకుల్ జిందల్, కలెక్టర్ తమీమ్ అన్సారీయాతో కలిసి హెలిపాడ్, రాకపోక మార్గాలు, భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ట్రాఫిక్ నిర్వహణ, భద్రతా ప్రణాళికపై అధికారులకు సూచనలు చేసి సమన్వయంగా ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
News November 5, 2025
గుంటూరు: ‘ప్రైవేట్ కాలేజీల నిర్లక్ష్యంపై చర్యలేవి’

రాజధాని అమరావతిలోని ప్రైవేట్ కాలేజీలో ఫుడ్ పాయిజన్ కేసులు పెరుగుతున్నప్పటికీ ప్రభుత్వం స్పందించడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలేజీలలో నిల్వ ఉంచిన ఆహారాన్ని విద్యార్థులకు పెట్టడంతో విద్యార్థుల ప్రాణాలు పోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయన్నారు. రాజధానిలో ప్రైవేట్ కాలేజీల నిర్లక్ష్యంపై ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.


