News March 7, 2025
బాపట్ల: మహిళా దినోత్సవానికి రానున్న మంత్రులు

ఈ నెల 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నట్లు రేపల్లె ఆర్డీవో రామలక్ష్మి తెలిపారు. మహిళా దినోత్సవం నిర్వహించే రేపల్లె ఎంసీఏ పంక్షన్ హాల్లో ఏర్పాట్లను జాయింట్ కలెక్టర్ ప్రఖర్ జైన్, బాపట్ల జిల్లా అడిషనల్ ఎస్పీ విఠలేశ్వర్, మంత్రి అనగాని సత్య ప్రసాద్ సోదరుడు శివప్రసాద్తో కలిసి పరిశీలించారు. మంత్రులు సత్య ప్రసాద్, పార్థసారథి, కలెక్టర్ పాల్గొంటారన్నారు.
Similar News
News December 10, 2025
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(<
News December 10, 2025
మీ పిల్లల స్కూల్ బ్యాగు ఎంత బరువుండాలంటే?

ప్రస్తుతం ప్రైమరీ విద్యార్థులు కూడా మోయలేనంత బరువున్న బ్యాగులతో స్కూళ్లకు వెళ్తూ ఇబ్బందిపడుతున్నారు. అయితే ‘NEP-2020’ మార్గదర్శకాల ప్రకారం స్కూల్ బ్యాగ్ బరువు పిల్లల శరీర బరువులో 10 శాతం ఉండాలి. ప్రీ ప్రైమరీకి బ్యాగులే ఉండవు. 5వ తరగతి వరకు 1.6-2.5KG, 6-7 క్లాస్కి 2-3KG, 9-10 విద్యార్థుల బ్యాగులు 2.5-4.5KG మించకూడదు. అధిక భారం వల్ల పిల్లలకు వెన్ను నొప్పి, భుజాల సమస్యలు రావొచ్చు. SHARE IT
News December 10, 2025
కామారెడ్డి జిల్లాలో దారుణ హత్య

కామారెడ్డి జిల్లా బీబీపేట మండలంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. రాంరెడ్డిపల్లికి చెందిన కూకట్ల సత్తయ్య(55)ను మంగళవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. విషయం తెలుసుకున్న ఎస్సై విజయ్ హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ హత్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్న వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


