News March 28, 2025
బాపట్ల: మెగా డీఎస్సీకి హాజరయ్యే వారికి ఉచిత శిక్షణ

మెగా డీఎస్సీ పరీక్షకు హాజరయ్యే బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఆన్లైన్ ద్వారా ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకట మురళి శుక్రవారం ప్రకటన ద్వారా తెలిపారు. ఇందు కోసం దరఖాస్తులను బీసీ సంక్షేమ సాధికారిత అధికారి కార్యాలయంలో అందజేయాలని సూచించారు. దరఖాస్తుతో పాటు సంబంధిత సర్టిఫికెట్లను అందజేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు.
Similar News
News November 22, 2025
రేపు మచిలీపట్నంలో సత్యసాయి జయంతి: కలెక్టర్

భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి శత జయంతి వేడుకలను ఈనెల 23వ తేదీన జిల్లాలో అధికారిక వేడుకగా నిర్వహించనున్నట్టు కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. మచిలీపట్నం ఈడేపల్లిలోని శ్రీ సత్యసాయి సేవా సమితి కార్యాలయం వద్ద సాయంత్రం 5 గంటలకు జిల్లాస్థాయి వేడుకను నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ వేడుకల్లో బాబావారి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కలెక్టర్ కోరారు.
News November 22, 2025
GHMC నోటీసులపై రామానాయుడు స్టూడియోస్ క్లారిటీ

జీహెచ్ఎంసీ <<18346319>>నోటీసులపై<<>> రామానాయుడు స్టూడియోస్ స్పష్టత ఇచ్చింది. తాము వినియోగిస్తున్న స్థలాన్ని తక్కువగా చూపించట్లేదని ప్రకటనలో తెలిపింది. ఎప్పటి నుంచో 68,276 చదరపు అడుగులకు ఆస్తి పన్ను కడుతున్నట్లు వెల్లడించింది. జీహెచ్ఎంసీ నిర్దేశించిన ట్రేడ్ లైసెన్స్ ఫీజు చెల్లించినట్లు పేర్కొంది. GHMC నిబంధనలకు అనుగుణంగా పూర్తి పారదర్శకంగా నడుచుకుంటున్నట్లు స్పష్టం చేసింది.
News November 22, 2025
ప్రభుత్వ ఆస్పత్రుల నిర్లక్ష్యంపై CM ఆగ్రహం

AP: ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యంపై CM చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలిచ్చారు. కాకినాడ GGHలో గడిమొగకు చెందిన 8నెలల గర్భిణి మల్లేశ్వరి ప్రాణాలు కోల్పోవడం, రాజమండ్రి ఆసుపత్రిలో 55ఏళ్ల రోగికి ఎక్స్పైరైన మందులివ్వడంతో ఆ రోగి మరింత అనారోగ్యం పాలయ్యారు. ఈ ఘటనలపై పూర్తి స్థాయి విచారణ జరపాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.


