News March 29, 2025
బాపట్ల: యువకులను కాపాడిన పోలీసులు

బాపట్ల మండలం సూర్యలంక సముద్రతీరంలో అలల తాకిడికి మునిగిపోతున్న యువకులను పోలీసులు కాపాడారు. పోలీసుల కథనం మేరకు.. నల్గొండ జిల్లాకు చెందిన చిన్న, శ్రీనులు శనివారం బాపట్ల మండలం సూర్యలంక సముద్ర తీరానికి వచ్చారు. స్నానం చేస్తుండగా అలల తాకిడికి మునిగిపోతుండగా స్థానికులు కేకలు వేయటంతో వెంటనే పోలీసులు కొట్టుకుపోతున్న వారిని కాపాడారు.
Similar News
News December 6, 2025
GNT: రూ.10కి వ్యర్థాలు ప్రమాదంలో ప్రజల ఆరోగ్యం

ఉమ్మడి గుంటూరు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో చేపల చెరువుల్లో నిషేధిత చికెన్ పేగులు, హోటల్ వ్యర్థాల వాడుతున్నారు. చాలా ప్రాంతాల్లో చేపల మేత కోసం వ్యర్థాలను కిలో రూ.10 చొప్పున కొని ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారు. గోదావరి జిల్లాల్లో నిషేధించిన ఈ వ్యర్థాలను ఇక్కడ మాత్రం గోప్యంగా కొనసాగుతున్నాయి. అధికారులు వెంటనే స్పందించి వ్యర్ధాలను నిషేధించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
News December 6, 2025
తిరుపతి: స్థానిక MP ప్రొటోకాల్ లేదా..?

తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో శనివారం అంబేడ్కర్ వర్ధంతి జరగనుంది. ఈ కార్యక్రమానికి స్థానిక MP డాక్టర్ గురుమూర్తికి ఆహ్వానం లభించలేదని కొందరు ఆరోపిస్తున్నారు. ఆహ్వాన పత్రికలో ఆయన పేరు లేకపోవడం దీనికి నిదర్శనంగా తెలుస్తుంది. కేంద్ర ప్రభుత్వ యూనివర్సిటీలో స్థానిక MP ప్రొటోకాల్ పాటించకపోవడం పట్ల వైసీపీ నాయకులు, విద్యావేత్తలు అధికారులు తీరుపట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారు.
News December 6, 2025
VZM: వెనుకబడ్డ మండలాలపై కలెక్టర్ అసహనం

100 రోజుల పనిదినాల కల్పనలో వెనుకబడిన మండలాలపై కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. ఉపాధి హామీ పనిదినాల కల్పనపై శుక్రవారం వీసీ నిర్వహించారు. వంగర, మెంటాడ, జామి, వేపాడ, కొత్తవలస, తదితర మండలాలకు మెమోలు జారీ చేయాలని ఆదేశించారు. ప్రగతి చూపని మండలాల్లో పనులను వెంటనే వేగవంతం చేయాలని, వేతనం రూ.300కి తగ్గకుండా పనులు కల్పించాలని ఏపీడీ, ఎంపీడీఓ, ఏపీఓలకు సూచించారు.


