News March 19, 2025
బాపట్ల: రూ.149 కోట్ల పనులు మంజూరు

జలజీవన్ మిషన్ద కింద జిల్లాకు రూ.149 కోట్లతో 337 పనులు మంజూరు అయ్యాయని బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకట మురళి అన్నారు. బుధవారం బాపట్ల కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో జిల్లా స్థాయి సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. జలజీవన్ మిషన్ క్రింద ప్రభుత్వం మంజూరు చేసిన పనులకు టెండర్లు పిలవాలని అధికారులను ఆదేశించారు.
Similar News
News October 28, 2025
నర్సీపట్నం నుంచి దూర ప్రాంతాలకు వెళ్లే బస్సులు రద్దు

నర్సీపట్నం ఆర్టీసీ డిపో నుంచి దూరప్రాంతాలకు వెళ్లే బస్సులను రద్దు చేసినట్టు ప్రజా రవాణా సంస్థ డిపో మేనేజర్ ధీరజ్ తెలిపారు. విజయవాడ, హైదరాబాద్, కాకినాడ తదితర రూట్ల బస్సులను 3రోజుల పాటు నిలిపివేసినట్లు ఆయన తెలిపారు. ఏజెన్సీ ప్రాంతానికి వెళ్లి బస్సులను చింతపల్లి వరకే నడుపుతున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన తర్వాత బస్సులను పునరుద్ధరిస్తామని పేర్కొన్నారు.
News October 28, 2025
అవసరమైతే సహాయ చర్యలు చేపట్టండి: లోకేశ్

మొంథా తుఫాను తీవ్రతను సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి మంత్రి నారా లోకేశ్ మంగళవారం సమీక్షించారు. హోంమంత్రి వంగలపూడి అనిత, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తుఫాను పరిస్థితులను నిరంతరం అంచనా వేయాలని, ఎలాంటి అత్యవసర పరిస్థితులకైనా సిద్ధంగా ఉండాలని అధికారులను మంత్రి ఆదేశించారు. కూటమినేతలు, కార్యకర్తలు ప్రజలకు అవసరమైన సహాయ చర్యలు చేపట్టాలని కోరారు.
News October 28, 2025
అవసరమైతే కేంద్రం సాయం కోరుతాం: CBN

AP: అందరూ సహాయక చర్యల్లో పాల్గొనాలని CM చంద్రబాబు కూటమి నేతలకు టెలీకాన్ఫరెన్స్లో పిలుపునిచ్చారు. ‘రాత్రికి మచిలీపట్నం-కళింగపట్నం మధ్య తుఫాను తీరం దాటుతుంది. కృష్ణా, ప.గో, కోనసీమ, ఏలూరు జిల్లాలకు భారీ వర్ష సూచన ఉంది. ప్రాణనష్టం పూర్తిగా తగ్గించడం, ఆస్తినష్టం నివారించేలా చర్యలు చేపట్టాం. పిల్లలు, గర్భిణులు, వృద్ధులను సురక్షిత ప్రాంతాలకు చేర్చాలి. అవసరమైతే కేంద్రం సాయం కోరుతాం’ అని తెలిపారు.


