News March 20, 2025
బాపట్ల: రూ.149 కోట్ల పనులు మంజూరు

జలజీవన్ మిషన్ద కింద జిల్లాకు రూ.149 కోట్లతో 337 పనులు మంజూరు అయ్యాయని బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకట మురళి అన్నారు. బుధవారం బాపట్ల కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో జిల్లా స్థాయి సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. జలజీవన్ మిషన్ క్రింద ప్రభుత్వం మంజూరు చేసిన పనులకు టెండర్లు పిలవాలని అధికారులను ఆదేశించారు.
Similar News
News December 5, 2025
పాలమూరు: ఆడపిల్ల పుడితే రూ.10 వేలు.. బాండ్ పేపర్

ఆడపిల్ల పుడితే రూ.10 వేలు, గ్రామంలో ఎవరైనా చనిపోతే అంతక్రియల నిమిత్తం రూ.5 వేలు ఇస్తామని మహబూబ్ నగర్ జిల్లా గండీడ్ మండలం పగిడ్యాల్ గ్రామ సర్పంచ్ అభ్యర్థి బోరు కవిత రాసిన హామీ బాండ్ పేపర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తనను గెలిపిస్తే ఇంటింటికి మరుగుదొడ్డి, విద్యార్థులకు సాయంత్రం ఉచిత తరగతులు, అన్ని వర్గాలకు కమ్యూనిటీ హాల్ తదితర 12 హామీలతో బాండ్ పేపర్ రాశారు. ఆమె BSC,B.ED పూర్తి చేసింది.
News December 5, 2025
గన్నవరం: వల్లభనేని వంశీ అనుచరుల్లో మరొకరి అరెస్ట్

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ముఖ్య అనుచరుల్లో ఒకరైన యర్రంశెట్టి రామాంజనేయులు (ఏ9) పోలీసులు అరెస్ట్ చేశారు. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో ఇతను కీలకంగా వ్యవహరించి ఉన్నాడు. గురువారం కేసరపల్లిలోని ఆయన నివాసంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత కొంతకాలంగా ఇతను పరారీలో ఉన్నాడు. శుక్రవారం అతనిని కోర్టులో హాజరు పరచనున్నారు. ఇటీవల పలువురు వంశీ అనుచరులు కోర్టులో లొంగిపోయిన విషయం తెలిసిందే.
News December 5, 2025
అనకాపల్లి: పోలీస్ ఆరోగ్య భీమా పథకాన్ని ప్రారంభించిన హోంమంత్రి

పోలీస్ ఆరోగ్య భీమా పథకాన్ని హోం మంత్రి వంగలపూడి అనిత గురువారం విశాఖ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ప్రారంభించి ఇన్సూరెన్స్ బాండ్లను పోలీస్ సిబ్బందికి అందజేశారు. సమాజ శ్రేయస్సు కోసం పనిచేసే పోలీసులకు ఆరోగ్య భీమా పథకాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. అహర్నిశలు శ్రమించే పోలీసుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఈ పథకాన్ని ప్రారంభించామన్నారు.


