News April 12, 2025

బాపట్ల: రెండు కుటుంబాల మధ్య చిచ్చు రేపిన వివాహేతర సంబంధం

image

బాపట్ల జిల్లాలో వివాహేతర సంబంధం 2 కుటుంబాల మధ్య చిచ్చురేపింది. విజయలక్ష్మీపురానికి చెందిన లక్ష్మీనారాయణ ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అతని భార్యకు కంటి సంబంధిత సమస్య ఉండటంతో హైదరాబాదుకు తీసుకెళ్లడానికి నిర్ణయించుకున్నాడు. అతని ప్రయాణానికి ప్రియురాలు నిరాకరించడంతో గురువారం లక్ష్మీనారాయణ, శుక్రవారం ప్రియురాలు పెట్రోలు పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు సీఐ తెలిపారు.

Similar News

News September 15, 2025

భారీగా తగ్గిన స్విఫ్ట్ కారు ధర

image

GST సంస్కరణల నేపథ్యంలో మారుతీ సుజుకీ తమ కార్ల ధరలను తగ్గించింది. స్విఫ్ట్ కారు ధర వేరియంట్స్‌‌ను బట్టి రూ.55 వేల నుంచి గరిష్ఠంగా రూ.1.06లక్షల వరకు తగ్గింది. దీంతో బేసిక్ వేరియంట్ రేట్(ఎక్స్ షోరూం) రూ.5.94 లక్షలకు చేరింది. ఆల్టో కే10 ప్రారంభ ధర రూ.2.77 లక్షలు, ఎస్-ప్రెస్సో రేట్ రూ.3.90 లక్షలు, వాగన్R ధర రూ.5.26 లక్షలు, డిజైర్ రేట్ రూ.6.24 లక్షలకు తగ్గింది. ఈ ధరలు ఈనెల 22 నుంచి అమల్లోకి రానున్నాయి.

News September 15, 2025

విజయనగరం ఎస్పీ కార్యాలయానికి 32 ఫిర్యాదులు

image

ఫిర్యాదు చేసిన బాధితుల సమస్యలను పోలీసు అధికారులు చట్ట పరిధిలో పరిష్కరించాలని జిల్లా అదనపు ఎస్పీ పి.సౌమ్య లత అన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. కార్యక్రమంలో ఆమె ప్రజల నుండి 32 ఫిర్యాదులు స్వీకరించారు. బాధితుల ఫిర్యాదులపై అధికారులు తక్షణమే స్పందించి 7 రోజుల్లోగా పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

News September 15, 2025

బెల్లంపల్లి: విద్యుత్ షాక్‌తో వ్యవసాయ కూలీ మృతి

image

బెల్లంపల్లి మండలం పెరకపల్లికి చెందిన కూలీ శంకరయ్య (50) విద్యుత్ షాక్‌తో మృతి చెందాడు. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇందిరమ్మ ఇంటి నిర్మాణంలో తలుపులు బిగిస్తుండగా విద్యుత్ వైరు తగిలింది. వెంటనే గమనించిన గ్రామస్థులు కర్రలతో కొట్టడంతో శంకరయ్య కింద పడ్డాడు. అతణ్ని హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు.