News April 12, 2025
బాపట్ల: రెండు కుటుంబాల మధ్య చిచ్చు రేపిన వివాహేతర సంబంధం

బాపట్ల జిల్లాలో వివాహేతర సంబంధం 2 కుటుంబాల మధ్య చిచ్చురేపింది. విజయలక్ష్మీపురానికి చెందిన లక్ష్మీనారాయణ ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అతని భార్యకు కంటి సంబంధిత సమస్య ఉండటంతో హైదరాబాదుకు తీసుకెళ్లడానికి నిర్ణయించుకున్నాడు. అతని ప్రయాణానికి ప్రియురాలు నిరాకరించడంతో గురువారం లక్ష్మీనారాయణ, శుక్రవారం ప్రియురాలు పెట్రోలు పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు సీఐ తెలిపారు.
Similar News
News April 10, 2026
సిరిసిల్ల: ఆన్‌లైన్‌లోనే ఇసుక బుకింగ్.. కలెక్టర్ సమీక్ష

ఇసుక తరలింపులో పారదర్శకత కోసమే ప్రభుత్వం ‘మన ఇసుక వాహనం’ విధానాన్ని అమల్లోకి తెచ్చిందని కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు. గృహ, ప్రభుత్వ నిర్మాణదారులు ఈ ఆన్‌లైన్ విధానాన్ని వినియోగించుకోవాలని కోరారు. మొబైల్ యాప్ ద్వారా బుకింగ్ చేసుకునే ప్రక్రియపై అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్‌తో కలిసి ఆమె సమీక్షించారు. ప్రజలు దళారులను నమ్మి మోసపోవద్దని, ప్రభుత్వం నిర్ణయించిన ధరకే ఇసుక పొందాలని సూచించారు.
News April 10, 2026
రోడ్డు భద్రతపై ‘అరైవ్ అలైవ్’: కలెక్టర్ ఆదేశం

జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆదేశించారు. శుక్రవారం ఎస్పీ నరసింహతో కలిసి ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమంపై సమీక్షించారు. ఈనెల 13 నుంచి 18 వరకు జిల్లావ్యాప్తంగా అవగాహన సదస్సులు నిర్వహించాలని, 14న అంబేడ్కర్ జయంతి సందర్భంగా అందరితో రోడ్డు భద్రత ప్రతిజ్ఞ చేయించాలని సూచించారు. గోల్డెన్ అవర్ ప్రాముఖ్యతను ప్రజలకు వివరించాలని కలెక్టర్ కోరారు.
News April 10, 2026
జనాభా గణనను పారదర్శకంగా చేపట్టాలి: కలెక్టర్

భీమవరం మున్సిపల్ కార్యాలయంలో “భారతదేశ జనాభా గణన 2027” శిక్షణ కార్యక్రమాన్ని కలెక్టర్ చదలవాడ నాగరాణి శుక్రవారం పర్యవేక్షించారు. మే 1 నుంచి ప్రారంభమయ్యే గృహాల జాబితా నమోదు ప్రక్రియను పారదర్శకంగా చేపట్టాలని ఎన్యూమరేటర్లకు సూచించారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం జనాభా గణన రెండు దశల్లో జరుగుతుందని, ప్రతీ ఇంటి డేటాను సమగ్రంగా సేకరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.


