News April 16, 2025
బాపట్ల: రెవెన్యూ సమస్యలు పరిష్కరించాలి- కలెక్టర్

రెవెన్యూ సమస్యలపై ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా వాటిని ఎప్పటికప్పుడు పరిష్కారం చేయాలని కలెక్టర్ వెంకట మురళి అన్నారు. బుధవారం రెవెన్యూ సమస్యలపై కలెక్టర్ కార్యాలయం నుంచి ఆర్డీఓలు, తహశీల్దార్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దష్టి సారించాలన్నారు. పీజీఆర్ఎస్ సమస్యలను పెండింగ్ లేకుండా వెంటనే పరిష్కరించాలన్నారు.
Similar News
News November 20, 2025
వరంగల్ కలెక్టర్ను అభినందించిన ఎమ్మెల్యే రేవూరి

దక్షిణ భారతదేశంలో జల సంరక్షణ కేటగిరీ-2లో తొలి స్థానం సాధించిన సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదను పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి అభినందించారు. డిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ అవార్డు, రూ. కోటి బహుమతిని స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాష్ట్రానికి గౌరవం తీసుకువచ్చిన కలెక్టర్ ను ప్రశంసించారు.
News November 20, 2025
HYD: రాజమౌళిపై PSలో ఫిర్యాదు

HYD రామోజీ ఫిల్మ్ సిటీలో హీరో మహేశ్ బాబు నటించిన వారణాసి సినిమా టైటిల్ రిలీజ్ ఈవెంట్లో హనుమంతుడిపై సినీ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి అనుచిత వ్యాఖ్యలు చేశారని యుగ తులసి పార్టీ అధ్యక్షుడు, టీటీడీ పాలకమండలి మాజీ సభ్యుడు కె.శివ కుమార్ అన్నారు. ఈ మేరకు అతడిపై కేసు నమోదు చేసి, అరెస్ట్ చేయాలని కోరుతూ న్యాయవాది వినోద్తో కలిసి అబ్దుల్లాపూర్మెట్ PSలో ఫిర్యాదు చేశారు.
News November 20, 2025
భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న సినీ నటుడు ఆది సాయికుమార్

వరంగల్ భద్రకాళి అమ్మవారిని గురువారం ప్రముఖ సినీ నటుడు ఆది సాయికుమార్ దర్శించుకున్నారు. అనంతరం అర్చకులు శేషు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి అమ్మవారి శేష వస్త్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ధర్మకర్త వీరన్న, అధికారులు క్రాంతి కుమార్, సీనియర్ అసిస్టెంట్ హరినాథ్ తదితరులు పాల్గొన్నారు.


