News February 2, 2025
బాపట్ల: రేపటి కార్యక్రమం రద్దు

జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ జె.వెంకట మురళి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నామని కలెక్టర్ చెప్పారు. జిల్లాలోని ప్రజలు ఈ విషయాన్ని గమనించాలన్నారు.
Similar News
News November 19, 2025
9.2 కేజీల బంగారు సత్యసాయి విగ్రహం ఊరేగింపు

AP: పుట్టపర్తిలో సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలు నిన్న అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. 9.2 కేజీల బంగారంతో తయారు చేసిన సత్యసాయి విగ్రహాన్ని వెండి రథంలో పట్టణంలో ఊరేగించారు. భక్తజన సంద్రమైన ప్రశాంతి నిలయంలో ‘సురంజలి’ పేరుతో సంగీత కార్యక్రమం జరిగింది. నేడు ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్, సచిన్ టెండూల్కర్, ఐశ్వర్యరాయ్ తదితర ప్రముఖులు జయంతి ఉత్సవాల్లో పాల్గొననున్నారు.
News November 19, 2025
తిరుపతి రైతులకు నేడు నగదు జమ

తిరుపతి జిల్లా రైతులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అన్నదాత సుఖీభవ పథకం రెండో విడత నగదు ఇవాళ విడుదల కానుంది. జిల్లాలోని 1,54, 908 మంది రైతులకు రూ.104 కోట్లు బుధవారం జమ చేయనున్నారు. కడప జిల్లా నుంచి సీఎం చంద్రబాబు నగదు విడుదల చేస్తారు. తిరుపతి జిల్లాలో ప్రస్తుతం వరినాట్లు మొదలయ్యాయి. వీరికి ఈ నగదు ఎంతగానో ఉపయోగపడనుంది.
News November 19, 2025
నిజామాబాద్: 23 మందికి రూ.2.36 లక్షల జరిమానా

నిజామాబాద్ డివిజన్ పరిధిలో మద్యం తాగి వాహనాలు నడిపిన 30 మందిని పోలీసులు పట్టుకున్నారు. వారిని మంగళవారం జిల్లా మార్నింగ్ కోర్టులో సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ నూర్జహాన్ ఎదుట హాజరుపరిచారు. వారిలో 23 మందికి రూ.2.36 లక్షల జరిమానా విధిస్తూ తీర్పు నిచ్చింది. మరో ఏడుగురికి జైలు శిక్ష పడింది. అంతకు ముందు వారికి సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులు కౌన్సెలింగ్ ఇచ్చారు.


