News March 31, 2025
బాపట్ల: రేపటి ముఖ్యమంత్రి షెడ్యూల్ ఇలా….

చిన్నగంజాం మండలంలో ముఖ్యమంత్రి పర్యటన షెడ్యూల్‌ను CMO కార్యాలయ ప్రతినిధులు విడుదల చేశారు.★హెలిప్యాడ్ ద్వారా ఉదయం 11:10 కి కొత్త గోల్లపాలెం చేరుకుంటారు.★11:45 నుండి 12: 25 వరకు పెన్షన్లు పంపిణీ చేయనున్నారు.★12: 25 నుండి 12: 35 వరకు స్టాళ్లను పరిశీలించనున్నారు.★12: 35 నుండి 1: 30 వరకు ప్రజా వేదిక ద్వారా సభ నిర్వహించనున్నారు.అనంతరం పలు సమావేశాల తర్వాత సీఎం 3: 45 కి తిరుగు ప్రయాణం కానున్నారు.
Similar News
News April 23, 2025
ఒంగోలులో TDP నేత హత్య.. లోకేశ్ దిగ్ర్భాంతి

ఒంగోలులో టీడీపీ నేత వీరయ్య చౌదరి హత్య వార్త తనను షాక్‌కు గురిచేసిందని మంత్రి నారా లోకేశ్ అన్నారు. ‘వీరయ్య చౌదరిని దుండగులు అత్యంత కిరాతకంగా నరికి చంపడం దారుణం. యువగళం పాదయాత్రలో నాతోపాటు అడుగులు వేసిన వీరయ్య టీడీపీలో ఎంతో క్రియాశీలకంగా పనిచేశారు. హంతకులపై కఠిన చర్యలు తీసుకుంటాం’ అని లోకేశ్ ట్వీట్ చేశారు.
News April 23, 2025
డీఈఈ సెట్ దరఖాస్తులు ప్రారంభం

AP: రెండేళ్ల డిప్లమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌లో ప్రవేశాలకు డీఈఈ సెట్ నోటిఫికేషన్ విడుదలైంది. మే 8 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. వచ్చే నెల 20న హాల్‌టికెట్లు విడుదలవుతాయి. జూన్ 2, 3వ తేదీల్లో పరీక్ష నిర్వహించి అదే నెల 10న అధికారులు ఫలితాలను ప్రకటిస్తారు.
వెబ్‌సైట్: <
News April 23, 2025
MNCL: RPల నియామకానికి దరఖాస్తులు: DEO

ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాల స్థాయిలో సబ్జెక్ట్, జిల్లా రిసోర్స్ పర్సన్స్ నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ యాదయ్య తెలిపారు. ఆసక్తి గల ఉపాధ్యాయులు, హెచ్ఎంకు ఈ నెల 24 లోపు దరఖాస్తులను సమర్పించాలని సూచించారు. ఎంపికైన ఉపాధ్యాయుల వివరాలు 28న ప్రకటిస్తామన్నారు. ఏమనా సందేహాలు ఉంటే క్వాలిటీ కోఆర్డినేటర్ సత్యనారాయణ మూర్తిని 8985209588 నంబర్‌లో సంప్రదించాలని తెలిపారు.