News April 11, 2025
బాపట్ల: రేపే ఇంటర్ ఫలితాలు

ఇంటర్ ఫలితాలు రేపు విడుదల కానున్న నేపథ్యంలో విద్యార్థుల్లో ఉత్కంఠ నెలకొంది. తొలిసారి ఇంటర్ పరీక్షలు రాసిన ఫస్ట్ ఇయర్ విద్యార్థుల కంటే ఎక్కువగా, భవిష్యత్ లక్ష్యాలపై ఆశలు పెట్టుకున్న సెకండ్ ఇయర్ విద్యార్థుల్లో ఆత్రుత కనిపిస్తోంది. బాపట్ల జిల్లాలో ఫస్టియర్ 10,838, సెకండియర్ 8,381, మొత్తం 19,219 మంది పరీక్షలు రాసి రిజల్ట్స్ కోసం ఎదురుచూస్తున్నారు. ఫలితాల కోసం Way2News ఫాలో అవ్వండి.
Similar News
News November 5, 2025
కాకినాడ: మూడు రోజుల్లో వస్తా అన్నారు.. ఇంకా రాలేదే..!

గత నెల 9న ఉప్పాడలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించారు. ఈ సందర్భంగా మూడు రోజుల్లో తిరిగి ఇక్కడికి వచ్చి, కాకినాడ నుంచి కోనపాపపేట వరకు బోటులో పర్యటించి కాలుష్య జలాలను పరిశీలిస్తానని ఆయన హామీ ఇచ్చారు. దాదాపు నెల రోజులు కావస్తున్నా పర్యటనకు రాకపోవడంతో యూ.కొత్తపల్లి మండల మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. “డిప్యూటీ సీఎం గారు రండి, ఒక్కసారి కాలుష్యం చూడండి” అని వారు కోరుతున్నారు.
News November 5, 2025
ఏలూరు: మైనారిటీ విద్యార్థులకు పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ

ఏలూరులోని మైనారిటీల ఆర్థిక సంస్థ ఆధ్వర్యంలో మైనారిటీ (ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు, పార్సీలు, జైనులు) విద్యార్థులకు టీఈటీ, డీఎస్సీ, ఎస్సై, కానిస్టేబుల్ వంటి పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు ఇన్ఛార్జి కార్యనిర్వాహక సంచాలకులు ప్రభాకరరావు తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు www.apcedmmwd.org వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.
News November 5, 2025
పశువుల్లో రేబీస్ వ్యాధిని ఎలా గుర్తించాలి?

రేబీస్ వ్యాధి సోకిన పశువుల్లో జ్వరం వస్తుంది. తర్వాత కేంద్రనాడీ వ్యవస్థ దెబ్బతినడం వల్ల పశువులు అసాధారణంగా ప్రవర్తిస్తాయి. కండరాలలోని నరాలు దెబ్బతినడం వల్ల పక్షవాతం సోకుతుంది. మేతను మింగలేకపోవడం, నీటిని చూసి భయపడటం, అధిక లాలాజలం స్రవించడం, బలహీనత, ఎక్కువగా అరవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. పశువులను కుక్క కరిస్తే సాధ్యమైనంత త్వరగా వెటర్నరీ డాక్టరు సూచనలతో యాంటీరేబీస్ టీకా వేయించాలి.


