News April 11, 2025
బాపట్ల: రేపే ఇంటర్ ఫలితాలు

ఇంటర్ ఫలితాలు రేపు విడుదల కానున్న నేపథ్యంలో విద్యార్థుల్లో ఉత్కంఠ నెలకొంది. తొలిసారి ఇంటర్ పరీక్షలు రాసిన ఫస్ట్ ఇయర్ విద్యార్థుల కంటే ఎక్కువగా, భవిష్యత్ లక్ష్యాలపై ఆశలు పెట్టుకున్న సెకండ్ ఇయర్ విద్యార్థుల్లో ఆత్రుత కనిపిస్తోంది. బాపట్ల జిల్లాలో ఫస్టియర్ 10,838, సెకండియర్ 8,381, మొత్తం 19,219 మంది పరీక్షలు రాసి రిజల్ట్స్ కోసం ఎదురుచూస్తున్నారు. ఫలితాల కోసం Way2News ఫాలో అవ్వండి.
Similar News
News January 21, 2026
WPL: ఇక థ్రిల్లింగ్ మ్యాచులేనా?

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL-2026) ఈసారి థ్రిల్లింగ్‌గా మారింది. ఇప్పటికే RCB ప్లేఆఫ్ బెర్త్ ఖరారు చేసుకోగా మిగతా 2 జట్లు తేలాల్సి ఉంది. MI, యూపీ, గుజరాత్, ఢిల్లీ నాలుగేసి పాయింట్లతో ఉన్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై మిగతా 2 మ్యాచ్‌ల్లో గెలిస్తేనే పోటీలో ఉంటుంది. అటు గుజరాత్, ఢిల్లీ, UP తొలిసారి ట్రోఫీని అందుకునే అవకాశాన్ని నిలుపుకోవాలంటే మిగతా మ్యాచుల్లో ఆధిపత్యం ప్రదర్శించాల్సిందే.
News January 21, 2026
గ్రామపంచాయతీ నుంచి రామగుండం కార్పొరేషన్ వరకు..

జనగామ గ్రామ పంచాయతీ 11 వార్డులతో సర్పంచిగా గీట్ల జనార్థన్ రెడ్డి నుంచి రామగుండం 60 డివిజన్ల కార్పొరేషన్ వరకు విస్తరించింది. 1982లో రామగుండం నోటిఫైడ్ ఏరియా, 1957- 2009 వరకు RGM ప్రాంతం మేడారం నియోజకవర్గంలో ఉండేది. 1995లో మున్సిపాలిటీగా, 2003లో కార్పొరేషన్‌గా హోదా పెరిగింది. కార్పొరేషన్‌కు ఈసారి మూడోసారి ఎన్నికలు జరగనున్నాయి. సుమారు 93.87 చ.కి. వైశాల్యంలో విస్తరించి ఉంది.
News January 21, 2026
NZB: 1931లో మున్సిపాలిటీ.. 2005లో కార్పొరేషన్

NZB మున్సిపాలిటీ 1931 సంవత్సరంలో ఏర్పడింది. 1987లో దీన్ని ‘స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీ’గా అప్‌గ్రేడ్ చేశారు. 2005 మార్చి 5న ప్రభుత్వం జారీ చేసిన GO No.109 ప్రకారం నగరపాలక సంస్థ మున్సిపల్ కార్పొరేషన్‌గా మారింది. ప్రస్తుతం ఇది నిజామాబాద్ నగరపాలక సంస్థ పేరుతో 60 వార్డులతో పరిపాలన కొనసాగిస్తోంది.


