News May 12, 2024

బాపట్ల: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు చిన్నారుల మృతి

image

బాపట్ల జిల్లా పరిధిలోని చిన్నగంజాం మండలంలో ఆదివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. ద్విచక్ర వాహనం పై వెళ్తున్న వారిని కారు ఢీకొంది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు మృతి చెందగా.. చీరాల ఏరియా హాస్పిటల్‌కి తరలించారు. మృతులు బాపట్ల పట్టణంలోని ఆరో వార్డు వాసులుగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News November 15, 2025

వీధుల పాలైన బాల్యం.. కూటి కోసం భుజాలపై చెత్త భారం.!

image

పుస్తకాల సంచితో బడికి వెళ్లాల్సిన బాల్యం నేడు వీధుల పాలైంది. గుంటూరు నగర వీధుల్లో శనివారం కనిపించిన దృశ్యం చూపరుల హృదయాలను ద్రవింపజేసింది. ఎండను సైతం లెక్కచేయకుండా, పసి వయసులోనే కొందరు చిన్నారులు ప్లాస్టిక్ వ్యర్థాలను ఏరుకుంటూ జీవన పోరాటం సాగిస్తున్నారు. బాలల హక్కుల గురించి ఎన్ని చట్టాలు ఉన్నా, పట్టపగలే నగరంలో ఇలాంటి బాలకార్మిక దృశ్యాలు కనిపించడం ఆవేదన కలిగిస్తోందని స్థానికులు అభిప్రాయపడ్డారు.

News November 15, 2025

GNT: నేడు ఘట్టమనేని శివరామకృష్ణ వర్ధంతి

image

గుంటూరు (D) బుర్రిపాలెం గ్రామంలో 1943 మే 31న, ఘట్టమనేని శివరామకృష్ణ జన్మించారు.1965 తేనె మనసులు సినిమాతో ఆయన తెలుగు సినీ రంగంలో అడుగుపెట్టారు. తేనె మనసులు హిట్ అవడంతో, అప్పటి అగ్ర హీరోలతో పోటీపడి సూపర్ స్టార్‌గా ఎదిగారు. గూఢచారి 116, మోసగాళ్లకు మోసగాడు, అల్లూరి సీతారామరాజు, సింహాసనం, ఇలా ఎన్నో హిట్ సినిమాలతో 350పై చిలుకు సినిమాలు చేసి అగ్ర హీరోల సరసన నిలిచారు. 15 నవంబర్ 2022న తుది శ్వాస విడిచారు.

News November 15, 2025

గుంటూరు మిర్చీ యార్డులో 40,026 టిక్కీలు అమ్మకం

image

గుంటూరు మిర్చి యార్డుకు శుక్రవారం 34,160 మిర్చి టిక్కీలు విక్రయానికి వచ్చాయని గుంటూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉన్నతశ్రేణి కార్యదర్శి చంద్రిక తెలిపారు. ముందురోజు నిల్వ ఉన్న వాటితో కలిపి 40,026 అమ్మకం జరిగాయని ఇంకా యార్డు ఆవరణలో 7,698 మిర్చి టిక్కీలు నిల్వ ఉన్నట్లు ఆమె పేర్కొన్నారు. వివిధ రకాల మిరపకాయలకు ధరలు పలు విధాలుగా నమోదయ్యాయన్నారు.