News February 11, 2025

బాపట్ల: లాడ్జీలలో పోలీసుల తనిఖీలు

image

బాపట్ల జిల్లాలోని రిసార్ట్స్, లాడ్జీలు, హోటల్స్, దాబాలను జిల్లా పోలీస్ అధికారులు మంగళవారం తనిఖీ చేశారు. లాడ్జి నిర్వాహకులు అతిథుల గుర్తింపును తప్పనిసరిగా ధ్రువీకరించాలని, వారి వివరాలను నమోదు చేయాలని సూచించారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించబోమని హెచ్చరించారు. నిబంధనలను అతిక్రమించిన నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.

Similar News

News October 22, 2025

SRCL: NOV 3న అరుణాచలానికి స్పెషల్ బస్సు

image

రాజన్న సిరిసిల్ల డిపోవారు నవంబర్ 3న అరుణాచలానికి ప్రత్యేక బస్ సర్వీసును ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ వెల్లడించారు. తమిళనాడులోని అత్యంత పవిత్రమైన అరుణాచల శివ గిరి ప్రదక్షిణకు ప్రత్యేక టూర్ ప్యాకేజీని ప్రకటించారు. పెద్దలకు రూ.4,100/-, పిల్లలకు రూ.3,100/-లను టికెట్ ధరగా నిర్ణయించారు. ఈ బస్సు అరుణాచలం- అమ్మవారి శక్తిపీఠం గద్వాల జోగులాంబ మీదుగా వెళ్తుంది. వివరాలకు 9063152130 నంబర్‌ను సంప్రదించవచ్చు.

News October 22, 2025

గుడ్ న్యూస్.. ట్రేడ్ డీల్‌ దిశగా ఇండియా, అమెరికా

image

భారత్, అమెరికా మధ్య ట్రేడ్ డీల్ అతి త్వరలోనే కుదిరే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. వాణిజ్య చర్చల్లో పురోగతి సాధించినట్లు సమాచారం. ఒకవేళ ఒప్పందం కుదిరితే ప్రస్తుతం 50 శాతంగా ఉన్న టారిఫ్స్ 15-16 శాతానికి తగ్గే అవకాశం ఉంది. కాగా రెండు దేశాల మధ్య ట్రేడ్ డీల్ చర్చలు స్నేహపూర్వక వాతావరణంలో జరుగుతున్నాయని కేంద్ర మంత్రి <<18044575>>పీయూష్ <<>>గోయల్ చెప్పిన విషయం తెలిసిందే.

News October 22, 2025

WWC: పాక్ ఔట్.. భారత్‌లోనే సెమీస్, ఫైనల్

image

నిన్న సౌతాఫ్రికా చేతిలో ఓటమితో ఉమెన్స్ వరల్డ్ కప్ నుంచి పాక్ క్రికెట్ జట్టు నిష్క్రమించిన విషయం తెలిసిందే. దీంతో సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్‌లు భారత్‌లోనే జరగనున్నాయి. పాక్ సెమీస్‌/ఫైనల్‌కు వెళ్తే ఆ మ్యాచ్‌లు శ్రీలంకలో నిర్వహించాలన్న ఉద్దేశంతో ICC ఇంకా వేదికలను ఖరారు చేయలేదు. ఇప్పుడు పాక్ ఇంటికెళ్లడంతో ఈనెల 29, 30 తేదీల్లో సెమీఫైనల్స్, NOV 2న ఫైనల్ INDలోనే నిర్వహించనుంది.