News July 4, 2024
బాపట్ల: విధి నిర్వహణలో సైనికుడు గుండెపోటుతో మృతి
బాపట్ల పట్టణం భావపురి కాలనీకి చెందిన షేక్ రజ్జుబాషా అనే ఆర్మీ ఉద్యోగి విధి నిర్వహణలో గుండెపోటుతో మృతి చెందినట్లు, మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షుడు తాండ్ర సాంబశివరావు పేర్కొన్నారు. జమ్మూకశ్మీర్‌లో వీధి నిర్వహణలో ఉన్న రజ్జుబాషా అకాల మరణం బాధాకరమన్నారు. నేటి సాయంత్రానికి ఆయన మృతదేహం స్వస్థలానికి చేరుకుంటుందని తెలిపారు. వారి కుటుంబానికి మాజీ సైనిక సంక్షేమ సంఘం అండగా ఉంటుందన్నారు.
Similar News
News November 30, 2024
అది మహాభారతం అయితే.. ఇది ఆంధ్రభారతం
పల్నాటి యుద్ధం, ఆంధ్రాలోని పల్నాడు ప్రాంతములో 1176-1182 మధ్యకాలంలో జరిగింది. మహాభారతానికి, పల్నాటి వీరుల చరిత్రకు దగ్గరి పోలికలు ఉండటంతో దీనిని ‘ఆంధ్ర భారతం’ అనికూడా అంటారు. పల్నాటి యుద్ధంలో జరిగిన అపారమైన జన, ఆస్తి నష్టం వల్ల ఆంధ్ర రాజులందరూ బలహీనులయ్యారు. ఈ పరిస్థితిలో కాకతీయులు ఇక్కడున్న రాజులందరినీ ఓడించారు. కాగా కారంపూడిలో యుద్ధం జరిగిన స్థలాన్ని గుర్తించారు.
News November 30, 2024
2015లో ‘రిషితేశ్వరి’ రాసిన కన్నీటి లేఖ ఇదే.!
ANU విద్యార్థిని రిషితేశ్వరి చివరి క్షణాల్లో రాసిన లేఖ క్రూరమృగాలను సైతం కన్నీళ్లు పెట్టిస్తుంది. కనికరం లేకుండా కన్నీళ్లు పెట్టించిన సీనియర్‌లకు ఏం కుళ్లుపుట్టిందో ఏమో రిషితేశ్వరి చిరునవ్వును శాశ్వతంగా దూరం చేశారు. తండ్రితో పాటూ చదువంటే తనకెంతో ఇష్టమని, చదువు కోసం ANUకి వస్తే ప్రేమ పేరుతో సీనియర్లు వేధించారని అప్పట్లో రిషితేశ్వరి లేఖ రాసింది. కాగా ఈ కేసును కోర్టు కొట్టేయడంతో ఆమె లేఖ వైరలైంది.
News November 30, 2024
రిషితేశ్వరి ఆ రోజుల్లో ఎందుకు చనిపోయిందంటే.!
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ANU ఆర్కిటెక్చర్ విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్య చేసుకొని 9 ఏళ్లు గడిచింది. సీనియర్స్ చరణ్ నాయక్, శ్రీనివాస్ రిషితేశ్వరిని ప్రేమిస్తున్నాని వెంటపడటంతో అనీషా నాగసాయి లక్ష్మీవారికి సహకరించింది. ఈ క్రమంలోనే 2015 మే 18న ఆ యువకులు ఇద్దరూ రిషితేశ్వరి పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. అందుకోసమే తాను ఆత్మహత్య చేసుకుంటున్నాని 2015 జులై 14న రిషితేశ్వరి డైరీ రాసి చనిపోయింది.