News April 10, 2025
బాపట్ల : విషాదం.. ఇద్దరు చిన్నారుల దుర్మరణం

తాడేపల్లి పరిధిలోని ఇప్పటంలో విషాదం చోటుచేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిర్మాణంలో ఉన్న అపార్ట్మెంట్ గోతిలో పడి ఇద్దరు బాలలు మృతిచెందారు. అద్దంకి నుంచి పనికోసం వెళ్లిన కుటుంబంలో ఈ విషాదం జరిగింది. అపార్ట్మెంట్ యాజమాన్యం విషయాన్ని గోప్యంగా ఉంచి బాధిత కుటుంబాన్ని, చిన్నారుల మృతదేహాలను అద్దంకి పంపించినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో పోలీసులు విచారణ చేపట్టారు.
Similar News
News November 26, 2025
ఏలూరు: ఒడిశా టూ హైదరాబాద్ అక్రమ రవాణా

పోలవరం డీఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో జీలుగుమిల్లి పోలీసులు బుధవారం నిర్వహించిన విస్తృత వాహన తనిఖీల్లో గోవుల అక్రమ రవాణా వెలుగుచూసింది. ఒడిశా నుంచి హైదరాబాద్కు ఎటువంటి అనుమతి పత్రాలు లేకుండా లారీలో తరలిస్తున్న గోవులను గుర్తించి పట్టుకున్నారు. గోవులను సురక్షిత ప్రాంతానికి తరలించి, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.
News November 26, 2025
సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకోవాలి: సీఎం చంద్రబాబు

AP: నిరంతర శ్రమ, సరైన నిర్ణయాలు తీసుకుంటే అనుకున్నది సాధించగలమని సీఎం చంద్రబాబు అన్నారు. ‘స్టూడెంట్స్ అసెంబ్లీ’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. విద్యార్థులు ఎక్కడా తడబడకుండా మాక్ అసెంబ్లీలో చక్కగా మాట్లాడారని ప్రశంసించారు. సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకుంటూ ముందుకు సాగాలని సూచించారు. అనుకున్న లక్ష్యం నెరవేరాలంటే కష్టపడాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రజల గుండెల్లో అంబేడ్కర్ శాశ్వతంగా నిలిచిపోతారన్నారు.
News November 26, 2025
ములుగు: అధికార పార్టీలో అభ్యర్థిత్వంపై పోటీ..!

ములుగు జిల్లాలో సర్పంచ్ ఎన్నికల సందడి మొదలైంది. అధికార, ప్రతిపక్ష పార్టీల్లో ఎవరు బరిలో ఉండాలనే విషయంపై పోటీ నెలకొంది. కాంగ్రెస్ పవర్లో ఉండటంతో ఆ పార్టీలోనే ఒత్తిడి ఎక్కువగా ఉంది. ఇద్దరి కంటే ఎక్కువమంది పోటీకి ఆసక్తి చూపుతుండగా నేతలకు తలనొప్పిగా మారింది. జనరల్ రిజర్వేషన్, మేజర్ పంచాయతీలలో ఈ పరిస్థితి ఉంది. ముఖ్య నేతలు సర్దుబాటు చేయకుంటే తిప్పలు తప్పేలా లేవు. మీటింగులు పెట్టి మాట్లాడుతున్నారు.


