News April 10, 2025
బాపట్ల : విషాదం.. ఇద్దరు చిన్నారుల దుర్మరణం

తాడేపల్లి పరిధిలోని ఇప్పటంలో విషాదం చోటుచేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిర్మాణంలో ఉన్న అపార్ట్మెంట్ గోతిలో పడి ఇద్దరు బాలలు మృతిచెందారు. అద్దంకి నుంచి పనికోసం వెళ్లిన కుటుంబంలో ఈ విషాదం జరిగింది. అపార్ట్‌మెంట్ యాజమాన్యం విషయాన్ని గోప్యంగా ఉంచి బాధిత కుటుంబాన్ని, చిన్నారుల మృతదేహాలను అద్దంకి పంపించినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో పోలీసులు విచారణ చేపట్టారు.
Similar News
News April 19, 2025
అగ్ని ప్రమాద రహితంగా మార్చడమే లక్ష్యం: మంత్రి

అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా రాష్ట్ర విపత్తు స్పందన&అగ్నిమాపక సేవల శాఖ ఆధ్వర్యంలో ట్రెండ్ సెట్ మాల్‌లో శుక్రవారం మాక్ డ్రిల్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర హోమ్ మంత్రి వంగలపూడి అనిత హాజరయ్యారు. రాష్ట్రాన్ని అగ్ని ప్రమాద రహితంగా మార్చడమే లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా అగ్నిప్రమాలు జరిగేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను సిబ్బంది లైవ్‌లో చేసి చూపించారు.
News April 19, 2025
కలెక్టర్‌ను కలిసిన జీవియంసీ కాంట్రాక్టర్లు

విశాఖ కలెక్టర్, జీవీఎంసీ ఇన్‌ఛార్జ్ కమిషనర్ హరేంధిర ప్రసాద్‌ను కలిసిన జీవీఎంసీ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ఛైర్మన్ఆధ్వర్యంలో శుక్రవారం కలిశారు. జీవీఎంసీలో పెండింగ్‌లో ఉన్న బిల్లులు చెల్లించాలని కోరారు. కోట్లాది రూపాయలు అప్పులు చేసి వడ్డీలు కట్టలేకపోతున్నామని వాపోయారు. కలెక్టర్ వెంటనే స్పందించి రూ.ఆరు కోట్లు రిలీజ్ చేస్తామని హామీ ఇవ్వడం ఇచ్చారు.
News April 19, 2025
వినుకొండ: ఎద్దుల పోటీలు ప్రారంభించిన ఎమ్మెల్యే

వినుకొండ శివారులో శుక్రవారం రాష్ట్ర స్థాయి ఎద్దుల పోటీలు ప్రారంభమయ్యాయి. మదమంచిపాడు తిరునాళ్ల అనంతరం ప్రతి సంవత్సరం ఒంగోలు జాతి ఎడ్ల పందేలను ఏర్పాటు చేస్తారు. ఈ పోటీలకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు హాజరై పందేలను ప్రారంభించారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి రైతులు తమ ఎద్దులతో పోటీల్లో పాల్గొన్నారు. ఎద్దుల పోటీలను తిలకించేందుకు ప్రజలు భారీగా హాజరయ్యారు.