News April 11, 2025
బాపట్ల వైసీపీ జిల్లా ఆర్గనైజేషనల్ సెక్రటరీ నియామకం

బాపట్ల జిల్లా వైసీపీ ఆర్గనైజేషనల్ సెక్రటరీగా పర్చూరు నియోజకవర్గానికి చెందిన సీనియర్ నేత కోట శ్రీనివాసరావు నియమితులయ్యారు. ఈ మేరకు వైసీపీ కేంద్ర కార్యాలయం గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది. తన మీద నమ్మకంతో ఆర్గనైజేషనల్ సెక్రటరీగా నియమించిన జగన్ మోహన్ రెడ్డికి, నియోజకవర్గ వైసీపీ ఇన్‌ఛార్జి గాదె మధుసూదన్ రెడ్డికి కోట శ్రీనివాసరావు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు.
Similar News
News December 8, 2025
మావోయిస్టు కీలక నేత లొంగుబాటు.. MMCలో ఉద్యమం అంతం!

మావోయిస్టు పార్టీ కీలక నేత రామ్‌ధేర్ మజ్జీ సహా 12 మంది ఛత్తీస్‌గఢ్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. రామ్‌ధేర్ మహారాష్ట్ర-మధ్యప్రదేశ్-ఛత్తీస్‌గఢ్ (MMC) జోన్లో సెంట్రల్ కమిటీ సభ్యుడిగా ఉన్నాడు. ఇతడిపై రూ.3 కోట్ల రివార్డు ఉందని పోలీసులు తెలిపారు. రామ్‌ధేర్ లొంగుబాటుతో MMC జోన్లో మావోయిజం అంతమైనట్లేనని భావిస్తున్నారు.
News December 8, 2025
HYD: ప్రభుత్వ ఆఫీసర్లకు గ్లోబల్ సమ్మిట్ డ్యూటీ

గ్లోబల్ సమ్మిట్ సందర్భంగా ప్రభుత్వ అధికారులకు డ్యూటీ విధించారు. మీర్ఖాన్పేట్లో నేడు, రేపు సమ్మిట్ వైభవంగా జరగనుంది. భారీ సంఖ్యలో పోలీసులను సమ్మిట్ ప్రాంతానికి తరలిస్తూ కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. అదే విధంగా వివిధ శాఖల ప్రభుత్వ ఉద్యోగులను ఏర్పాట్ల పనుల కోసం నియమించడంతో వారు మొత్తం కార్యక్రమ నిర్వహణలో నిమగ్నమయ్యారు.
News December 8, 2025
NCCDలో ఉద్యోగాలు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

నేషనల్ సెంటర్ ఫర్ కోల్డ్‌చైన్ డెవలప్మెంట్లో 5 కాంట్రాక్ట్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. అర్హతగల వారు contact-nccd@gov.in ఈ మెయిల్ ద్వారా అప్లై చేసుకోవాలి. పోస్టును బట్టి BE, B.tech, PG(అగ్రి బిజినెస్), M.COM, CA ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: nccd.gov.in.


