News January 31, 2025

బాపట్ల: ‘వైసీపీ నిర్లక్ష్యంతో ఆర్థిక వ్యవస్థ పతనమైంది’

image

గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పతనమైందని బాపట్ల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఛైర్మన్, బాపట్ల జిల్లా టీడీపీ అధ్యక్షుడు సలగల రాజశేఖర్ బాబు చెప్పారు. గురువారం బాపట్లలోఆయన మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం విచ్చలవిడిగా అప్పు చేసి రూ.10 లక్షల కోట్లు భారం రాష్ట్రంపై పెట్టిందన్నారు. ఏడాదికి రూ.71 వేల కోట్లు అసలు, వడ్డీ చెల్లించాల్సి వస్తుందని చెప్పారు.

Similar News

News July 6, 2025

TU: జులై 15 వరకు గడువు ఇవ్వాలి: TUSC JAC

image

టీయూ రెండో స్నాతకోత్సవంలో పీజీ, Ph.D పట్టాలు పొందేందుకు దరఖాస్తు చేసుకోవడానికి మరికొన్ని రోజులు గడువు ఇవ్వాలని TUSC JAC పూర్వ అధ్యక్షుడు సత్యం కోరారు. 12 ఏళ్ల తర్వాత రెండో స్నాతకోత్సవం నిర్వహిస్తున్న సందర్భంగా పీజీ, Ph.D పట్టాలు పొందేందుకు విద్యార్థులకు కేవలం మూడు రోజుల సమయం ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. దరఖాస్తు చేసుకోవడానికి జులై 15వరకు గడువు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

News July 6, 2025

ఫార్మాసూటికల్స్‌‌లో అపార అవకాశాలు: మోదీ

image

అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలేతో అద్భుతమైన సమావేశం జరిగినట్లు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ‘అర్జెంటీనాతో 75 ఏళ్ల ద్వైపాక్షిక సంబంధాలు, అందులోనూ 5 ఏళ్ల వ్యూహాత్మక భాగస్వామ్యం ఉంది. రానున్నకాలం ఇరు దేశాల మధ్య మరింత ఆశాజనకంగా ఉంటుంది. వ్యవసాయం, రక్షణ, భద్రత, ఇంధన రంగాల్లో సహకారం గురించి చర్చించాం. ఫార్మాస్యూటికల్స్, క్రీడల వంటి రంగాల్లోనూ అపారమైన అవకాశాలు ఉన్నాయి’ అని తెలిపారు.

News July 6, 2025

NZB: ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు పక్కదారి పెట్టకుండా చూడాలి

image

ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు పక్కదారి పెట్టకుండా చూడాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. శనివారం ఆయన నిజామాబాద్ కలెక్టరేట్‌లో సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడారు. నిధులు దుర్వినియోగం అయితే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జనాభా ప్రాతిపదికన నిధులు ఖర్చు చేయాలని అధికారులకు సూచించారు.