News June 24, 2024
బాపట్ల: సముద్ర తీరాలకు పర్యాటకుల నిలిపివేత

బాపట్ల జిల్లా పరిధిలోని సముద్ర తీరాలకు పర్యాటకులను అధికారులు నిలిపివేస్తున్నారు. రెండ్రోజుల్లో ఆరుగురు పర్యాటకులు మృతిచెందడం, పలువురు గల్లంతు అయిన నేపథ్యంలో కొన్నిరోజుల పాటు సముద్రతీరాలకు పర్యాటకులను నిలిపివేయాలని బాపట్ల పోలీస్ శాఖ నిర్ణయించింది. ఇప్పటికే చీరాల, బాపట్ల పరిధిలో ఉన్న తీర ప్రాంతాలకు పర్యాటకులు రావడంతో పోలీసులు వెనక్కి పంపించేస్తున్నారు. పర్యాటకులు గల్లంతు కాకుండా చర్యలు చేపట్టారు.
Similar News
News October 16, 2025
తెనాలి: మహిళతో అసభ్య ప్రవర్తన.. నిందితుడికి జరిమానా

మహిళతో అసభ్యంగా ప్రవర్తించి, లైంగిక వేధింపులకు గురిచేసిన నిందితుడికి రూ. 2 వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి పవన్ కుమార్ బుధవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం మేరకు.. తెనాలి మండలం సోమసుందరపాలెం గ్రామానికి చెందిన మహిళ పట్ల ఆమె బావ వెంకట సుబ్బారావు 2021లో అసభ్యంగా ప్రవర్తించాడు. బాధితురాలి ఫిర్యాదుతో దాఖలైన చార్జ్‌షీట్‌పై విచారణ అనంతరం న్యాయమూర్తి ఈ మేరకు బుధవారం తీర్పు ఇచ్చారు.
News October 16, 2025
భాగస్వామ్య సదస్సుపై జిల్లాలో అవగాహన: కలెక్టర్

విశాఖపట్నంలో నవంబర్ 14, 15 తేదీల్లో జరగనున్న భాగస్వామ్య సదస్సు (ఇండస్ట్రీ పార్ట్‌నర్‌షిప్ డ్రైవ్) పోస్టర్‌ను కలెక్టర్ తమీమ్ అన్సారియా బుధవారం విడుదల చేశారు. ఈ నెల 15 నుంచి నవంబర్ 15 వరకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సదస్సులో జిల్లా నుంచి ఎక్కువ మంది భాగస్వామ్యం అయ్యేలా కృషి చేయాలని అధికారులను ఆమె ఆదేశించారు.
News October 15, 2025
మంగళగిరి: పోలీస్ అమరవీరుల దినోత్సవ ఏర్పాట్లు పరిశీలన

దేశవ్యాప్తంగా అక్టోబర్ 21న నిర్వహించబోతున్న పోలీసు అమరవీరుల దినోత్సవ ఏర్పాట్లను మంగళగిరి ఏపీఎస్‌పీ 6 బెటాలియన్‌లో ఎస్పీ వకుల్ జిందాల్ బుధవారం పరిశీలించారు. భద్రత, అమరవీరుల స్తూపం, స్టేజి నిర్మాణం, పరేడ్ స్థలాలను బెటాలియన్ ఇన్‌ఛార్జ్ కమాండెంట్ ఏ.మురళీ ఎస్పీకి వివరించారు. సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలన్నారు.