News March 17, 2025
బాపట్ల: సారా నిర్మూలనకు నవోదయం 2.0 ప్రారంభం

నాటుసారాను పూర్తి స్థాయిలో నిర్మూలించేందుకు ప్రభుత్వం నవోదయం 2.0 కార్యక్రమాన్ని ప్రారంభించిందని బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకట మురళి చెప్పారు. సోమవారం బాపట్లలో అధికారులతో కలిసి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. రాష్ట్రాన్ని సారా రహితంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం లక్ష్యం నిర్దేశించిందన్నారు. నవోదయం 2.0 కార్యక్రమం ద్వారా అర్హులైన వారికి ప్రత్యామ్నాయం మార్గాలను చూపిస్తామన్నారు.
Similar News
News November 17, 2025
ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన

AP: నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో ఇవాళ నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ప్రకాశం, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశం ఉందని చెప్పింది. ఈనెల 21 నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ ఉందని వెల్లడించింది.
News November 17, 2025
ఈనెల 17న ఉమ్మడి MBNR జిల్లా జూనియర్ ఖో-ఖో ఎంపికలు

ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా జూనియర్ ఖో-ఖో (బాలబాలికల) ఎంపికలు నవంబర్ 17న నాగర్కర్నూల్ జడ్పీహెచ్ఎస్ క్రీడా మైదానంలో నిర్వహించనున్నారు. సంగారెడ్డిలోని పటాన్చెరువులో జరగనున్న 44వ జూనియర్స్ ఇంటర్ డిస్ట్రిక్ట్ ఛాంపియన్షిప్ కోసం ఈ ఎంపికలు జరుగుతాయి. జనవరి 4, 2008 తర్వాత జన్మించిన 18 ఏళ్ల లోపు క్రీడాకారులు అర్హులని నిర్వాహకులు తెలిపారు.
News November 17, 2025
ఢిల్లీ పేలుడు: ఏమిటీ డెడ్ డ్రాప్?

ఢిల్లీ పేలుడు కేసు నిందితులు ‘డెడ్ డ్రాప్’ ఈ-మెయిల్ విధానం వాడినట్లు దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. ఒకే మెయిల్ IDతో రహస్యంగా సమాచార మార్పిడి చేసుకోవడమే ‘డెడ్-డ్రాప్’ పద్ధతి. సమాచారాన్ని డ్రాఫ్ట్లో సేవ్ చేస్తే, దాన్ని అవతలి వ్యక్తి చూస్తారు. తర్వాత అప్డేట్ లేదా డిలీట్ చేస్తారు. ఇందులో మెయిల్ పంపడం, రిసీవ్ చేసుకోవడమనేదే ఉండదు. దీన్ని గుర్తించడం చాలా కష్టమని అధికారులు అంటున్నారు.


