News March 24, 2025

బాపట్ల: సీఎం పర్యటించేది ఈ గ్రామంలోనే.!

image

సీఎం నారా చంద్రబాబు ఏప్రిల్ 1న పర్చూరు నియోజకవర్గంలోని చిన్నగంజాం మండలం పెదగంజాం గ్రామంలో పర్యటించనున్నట్లు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు వెల్లడించారు. గ్రామంలో ఆరోజు జరిగే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం పాల్గొంటారని ఆయన తెలిపారు. కాగా ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు పర్యటన ఏర్పాట్లపై సమీక్షించారు.

Similar News

News March 29, 2025

రేపు ఓటీటీలోకి ఉపేంద్ర యూఐ మూవీ?

image

ఉపేంద్ర స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘UI’ మూవీ రేపు సా.4.30 గంటలకు జీకన్నడ ఛానల్‌లో ప్రసారం కానుంది. ఆ వెంటనే జీ5 OTTలో తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది. గతంలో వెంకటేశ్ ‘సంక్రాంతికి వస్తున్నాం’, కిచ్చా సుదీప్ ‘మ్యాక్స్’ చిత్రాలు కూడా టీవీల్లో ప్రసారమైన కాసేపటికే జీ5లోకి వచ్చేశాయి. ఇదే ట్రెండ్‌ను యూఐ సినిమాకు కూడా ఓటీటీ సంస్థ కొనసాగించనుందని సమాచారం.

News March 29, 2025

ధోనీ బ్యాటింగ్‌కు ఎందుకు లేటుగా వస్తున్నారు?: వాట్సన్

image

CSK మాజీ కెప్టెన్ ధోనీ లోయర్ ఆర్డర్‌లో ఎందుకు బ్యాటింగ్ చేస్తున్నారో తనకు అర్థం కావడం లేదని ఆ జట్టు మాజీ ప్లేయర్ షేన్ వాట్సన్ అన్నారు. ఆ జట్టు వ్యూహం ఏంటో తెలియట్లేదని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అలాగే రుతురాజ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తే బాగుండేదని చెప్పారు. అశ్విన్ కంటే ముందే మహీని పంపించాలని సూచించారు. నిన్న 9వ స్థానంలో ధోనీ బ్యాటింగ్‌కు వచ్చే సరికే CSK చేతుల్లోంచి మ్యాచ్ చేజారిందని తెలిపారు.

News March 29, 2025

బాపట్ల: యువకులను కాపాడిన పోలీసులు

image

బాపట్ల మండలం సూర్యలంక సముద్రతీరంలో అలల తాకిడికి మునిగిపోతున్న యువకులను పోలీసులు కాపాడారు. పోలీసుల కథనం మేరకు.. నల్గొండ జిల్లాకు చెందిన చిన్న, శ్రీనులు శనివారం బాపట్ల మండలం సూర్యలంక సముద్ర తీరానికి వచ్చారు. స్నానం చేస్తుండగా అలల తాకిడికి మునిగిపోతుండగా స్థానికులు కేకలు వేయటంతో వెంటనే పోలీసులు కొట్టుకుపోతున్న వారిని కాపాడారు.

error: Content is protected !!