News March 23, 2025
బాపట్ల: సీనియర్ నాయకుడు శ్రీధర్ మృతి

బాపట్ల జిల్లా సీపీఐ సీనియర్ నాయకుడు, వ్యవసాయ కార్మిక సంఘాల ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ జేపీ శ్రీధర్ ఆదివారం తెల్లవారుజామున మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న సీపీఐ నాయకులు ఆయన మృతికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. పార్టీ కోసం ప్రజా సమస్యల కోసం నిరంతరం కృషి చేసే శ్రీధర్ మృతి చెందిన బాధాకరమని అన్నారు.
Similar News
News December 20, 2025
అనకాపల్లి: జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశాలు వాయిదా

ఉమ్మడి విశాఖ జిల్లా జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశాలను ఈనెల 26వ తేదీకి వాయిదా వేసినట్లు సీఈవో నారాయణమూర్తి శుక్రవారం తెలిపారు. సీఎం చంద్రబాబు అనకాపల్లి జిల్లాలో పర్యటిస్తున్న కారణంగా శనివారం జరగాల్సిన ఈ సమావేశాలను వాయిదా వేశామన్నారు. ఈ విషయాన్ని సభ్యులు, అధికారులు గమనించాలని విజ్ఞప్తి చేశారు.
News December 20, 2025
సంగారెడ్డి: రూమ్లో లవర్స్.. నాన్న ఎంట్రీతో విషాదం!

8వ అంతస్తు నుంచి జారిపడి యువతి మృతిచెందిన ఘటన SRDజిల్లా రామచంద్రపురం మం.లో జరిగింది. వివరాలు.. HYDకు చెందిన యువతి(20) ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తుంది. అక్కడ ఓ యువకుడితో పరిచయం ఏర్పడింది. కొల్లూర్ 2BHKలో ఉన్న ఇంటికి యువతి ఆ యువకుడితో వచ్చింది. ఆ సమయంలో తండ్రి ఇంటికి రావడంతో భయపడిన ఆమె బాల్కనీ గుండా పక్క ఫ్లాట్కు వెళ్లే ప్రయత్నంలో జారిపడి మృతిచెందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News December 20, 2025
రానున్న ఐదు రోజులు చలి ముప్పు

కర్నూలు, నంద్యాల జిల్లాలను చలి వణికిస్తోంది. రానున్న ఐదు రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పడిపోయి చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే జిల్లాలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 16-18 డిగ్రీలకు పడిపోవడంతో ప్రజలు గజగజ వణికిపోతున్నారు. సాయంత్రం నుంచే చలి ప్రభావం మొదలవుతోంది. ఈ నెల 24 వరకు కనిష్ఠ ఉష్ణోగ్రతలు 14-16°C నమోదయ్యే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.


