News March 29, 2025
బాపట్ల: 10వ తరగతి పరీక్ష వాయిదా

మార్చి 31వ తేదీ జరగాల్సిన పదవ తరగతి పరీక్ష రంజాన్ పండగను పురస్కరించుకొని వాయిదా వేసినట్లు బాపట్ల జిల్లా విద్యాశాఖ అధికారి పురుషోత్తం శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. వాయిదా విషయాన్ని జిల్లాలోని అన్ని పాఠశాల యాజమాన్యాలు, విద్యార్థులకు తెలియజేయాలని సూచించారు. పరీక్షను ఏప్రిల్ 1వ తేదీన నిర్వహించనున్నట్లు వెల్లడించారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.
Similar News
News November 7, 2025
డిసెంబర్లో పెళ్లి.. అంతలోనే..!

డిసెంబర్లో పెళ్లి జరగాల్సిన ఓ ఇంట్లో విషాదం నెలకొంది. రాబోయే కొత్త జీవితం కోసం కలలు కన్న రామును కోల్పోవడం కుటుంబానికి తట్టుకోలేని విషాదంగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. పెద్దపప్పూరు(M) చాగల్లులో గ్రామానికి చెందిన రాము(23) గురువారం టెంకాయ చెట్టును కొడుతుండగా విద్యుత్తు వైర్లు తగిలి షాక్కు గురయ్యాడు. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా.. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.
News November 7, 2025
అజిత్ సినిమాలో విజయ్ సేతుపతి, లారెన్స్!

హీరో అజిత్ కుమార్ ప్రస్తుతం అదిక్ రవిచంద్రన్ డైరెక్షన్లో AK 64 మూవీతో బిజీగా ఉన్నారు. సినిమాకి సంబంధించి పూర్తి వివరాలు జనవరిలో ప్రకటిస్తామన్నారు. దీనిని పాన్ ఇండియా లెవల్లో భారీ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్నారు. అయితే కోలీవుడ్ వర్గాల ప్రకారం ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, లారెన్స్ కీలక పాత్రల్లో కనిపిస్తారని చెబుతున్నారు. త్వరలోనే చిత్ర బృందం అధికారిక ప్రకటన విడుదల చేస్తుందని సమాచారం.
News November 7, 2025
నేడు వందేమాతర గేయం సామూహిక గీతాలాపన

వందేమాతర గేయం రచించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఉదయం 10 గంటలకు ASF కలెక్టరేట్ సముదాయం ఆవరణలో సామూహిక గీతాలాపన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే ఒక ప్రకటనలో తెలిపారు. బంకిం చంద్ర చటర్జీ వందేమాతర గేయ రచన చేసి 150 సంవత్సరాలు పూర్తయిందని, ఈ సందర్భంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు సామూహిక గీతాలాపన కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందన్నారు.


