News February 9, 2025
బాపట్ల: 12 మద్యం షాపులకు 159 దరఖాస్తులు

బాపట్ల జిల్లాలో గీత కులాలకు కేటాయించిన 12 మద్యం షాపులకు 159 దరఖాస్తులు వచ్చినట్లు బాపట్ల జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి దేవదత్తు తెలిపారు. శనివారం సాయంత్రం 5 గంటలకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ముగిసిందని, పదో తేదీన బాపట్ల కలెక్టరేట్ కార్యాలయంలో లాటరీ ప్రక్రియ ద్వారా షాపులు కేటాయిస్తామన్నారు. దరఖాస్తుదారులు 10వ తేదీ ఉదయం 8 గంటలలోపు హాజరుకావాలని సూచించారు.
Similar News
News February 10, 2026
పల్నాడు: పోలీస్ గ్రీవెన్స్‌కు ఫిర్యాదుల వెల్లువ

జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (PGRS)కు బాధితులు పోటెత్తారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి డీఎస్పీ వెంకటరమణ మొత్తం 99 ఫిర్యాదులను స్వీకరించారు. వీటిలో ప్రధానంగా కుటుంబ కలహాలు, ఆర్థిక వివాదాలకు సంబంధించిన సమస్యలే అధికంగా ఉన్నాయి. గ్రీవెన్స్ ఫిర్యాదులపై తక్షణమే స్పందించి, బాధితులకు సత్వర న్యాయం అందించాలని సంబంధిత అధికారులను డీఎస్పీ ఆదేశించారు.
News February 10, 2026
కెనడాపై సౌత్ ఆఫ్రికా ఘన విజయం

T20 WC: సౌత్ ఆఫ్రికాతో మ్యాచ్‌లో కెనడా తేలిపోయింది. 214 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో తడబడింది. అటు బౌలింగ్ ఇటు బ్యాటింగ్‌లోనూ ప్రభావం చూపలేకపోయింది. ధాలీవాల్(64), హర్ష్(33) మినహా ఎవరూ రాణించకపోవడంతో ఓటమి పాలైంది. SA జట్టు 57 పరుగుల తేడాతో భారీ విజయం నమోదు చేసింది. సౌత్ ఆఫ్రికా బౌలర్లలో ఎంగిడి 4, మార్కో జాన్సన్ 2, రబాడా, బోష్ చెరో వికెట్ తీశారు.
News February 10, 2026
భారత్‌తో మ్యాచ్ ఆడండి.. పాక్‌కు బంగ్లా రిక్వెస్ట్

పాకిస్థాన్ నిజమైన క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించిందని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ ప్రెసిడెంట్ అమినుల్ ఇస్లాం ప్రశంసల వర్షం కురిపించారు. ‘మాకు మద్దతుగా పాకిస్థాన్ నిలబడిన తీరుకు రుణపడి ఉంటాం. నేను నిన్న PCB ఛైర్మన్ మోహ్సిన్ నఖ్వీతో భేటీ అయ్యాను. వారి సపోర్ట్‌కు కృతజ్ఞతలు తెలిపాను. క్రికెట్ మేలు కోసం ఈ నెల 15న భారత్‌తో మ్యాచ్ ఆడాలని వారికి విజ్ఞప్తి చేశాను’ అని వ్యాఖ్యానించారు.


