News June 23, 2024

బాపట్ల: 24న మొదలవనున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక

image

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఈ నెల 24వ తేదీన సోమవారం మొదలవుతుందని బాపట్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం అధికారులు తెలిపారు. ప్రతి సోమవారం పని దినాల్లో నిర్వహించనున్నట్లు చెప్పారు. జిల్లా ప్రజలు తమ సమస్యలను లిఖితపూర్వకంగా రాసుకొని కలెక్టర్ కార్యాలయంలో తమ సమస్యలను పరిష్కరించుకోవాల్సిందిగా ఉత్తర్వులు వెలువడ్డాయి.

Similar News

News December 22, 2025

వినియోగదారుల్లో అవగాహన కల్పించాలి: కలెక్టర్

image

జాతీయ వినియోగదారుల వారోత్సవాల పోస్టర్‌ను జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా సోమవారం విడుదల చేశారు. ఈ నెల 24వ తేదీ వరకు జాతీయ వినియోగదారుల వారోత్సవాలు జరుగుతాయని కలెక్టర్ చెప్పారు. అవగాహన కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టాలని ఆదేశించారు. ఆహార పదార్థాల ప్యాకింగ్, వివిధ రంగుల్లో ఉండే గుర్తులను ఎలా గమనించాలి, ఏ విధమైన చర్యలు చేపట్టాలి అనే వాటిపై అవగాహన కల్పించాలని తెలిపారు.

News December 22, 2025

GNT: క్రిస్మస్ వేళ చిన్న వ్యాపారులకు నిరాశ..!

image

గుంటూరు జిల్లా క్రిస్మస్ సీజన్‌ కోసం రెడీమేడ్ దుస్తుల వ్యాపారులు వేచి చూస్తూ ఉంటారు. ఈ పండుగకు అందరూ కొత్త బట్టలు కొనుక్కోవడం ఆనవాయితీ, అయితే చిన్న రిటైల్ దుకాణదారులు ఆన్లైన్, షాపింగ్ మాల్స్ వల్ల సవాళ్లను ఎదుర్కొంటున్నారు. ఆఫర్లు, డిస్కౌంట్లు పెట్టినా చిన్న షాపులలో అనుకున్నంత వ్యాపారం జరగడం లేదని, స్థానిక షాపులను ఆదరించాలని వ్యాపారులు కోరుతున్నారు. దీనిపై మీ COMMENT?

News December 22, 2025

గుంటూరులో క్రీస్తు సేవ.. ఘన చరిత్ర కలిగిన చర్చిలు

image

క్రీస్తు చూపిన ప్రేమ, శాంతి మార్గంలో గుంటూరు చర్చిలు నడుస్తున్నాయి. AELC ఆధ్వర్యంలో విద్య, వైద్య సేవలు అందుతున్నాయి. 1842లో రెవరెండ్ హయ్యర్ స్థాపించిన సెయింట్ మ్యాథ్యూస్ ఈస్ట్ ప్యారిస్ చర్చికి 150ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. అలాగే 1905లో వెస్ట్ ప్యారిస్ చర్చిని నిర్మించారు. నార్త్ ప్యారిస్ చర్చి 60ఏళ్లుగా సేవలందిస్తోంది. 1940లో ఏర్పాటైన గుంటూరు మేత్రాసనం ఆధ్వర్యంలో పాఠశాలలు, ఆసుపత్రులు నడుస్తున్నాయి.