News March 3, 2025

బాపట్ల: 30,065ఓట్ల ఆధిక్యంలో ఆలపాటి

image

ఉమ్మడి గుంటూరు-కృష్ణా జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓట్ల కౌంటింగ్‌లో భాగంగా మూడో రౌండ్ కౌంటింగ్ పూర్తయింది. మూడో రౌండ్‌లో 28వేల ఓట్లు లెక్కించారు. కూటమి అభ్యర్థి ఆలపాటి రాజాకు 16,722 ఓట్లు రాగా.. కేఎస్ లక్ష్మణరావుకు 7,403 ఓట్లు వచ్చాయి. దీంతో ఇద్దరి మధ్య 9,319 ఓట్లు వ్యత్యాసం ఉంది. కాగా మూడో రౌండ్ పూర్తయ్యే సరికి ఆలపాటి 30,065 ఓట్లు ఆధిక్యంలో ఉన్నారు.

Similar News

News March 4, 2025

దుబాయ్‌లో కామారెడ్డి జిల్లా వాసి మృతి

image

కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలానికి చెందిన నరేశ్ దుబాయ్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల వివరాల ప్రకారం.. ఫిబ్రవరి 3న నరేశ్ పని నిమిత్తం దుబాయ్ వెళ్లాడు. అక్కడ ఫిబ్రవరి 24 నరేశ్ సూసైడ్ చేసుకున్నాడు. కాగా ఇవాళ ఉదయం డెడ్ బాడీ గ్రామానికి చేరుకుంది. నరేశ్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

News March 4, 2025

కరీంనగర్: పట్టభద్రుల ఎన్నిక కౌంటింగ్ అప్డేట్

image

కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఎన్నికలో ఇప్పటివరకు 2 లక్షల 10 వేల ఓట్లను లెక్కించినట్లు అధికారులు ప్రకటించారు. ఇందులో సుమారు 21 వేల ఓట్లు చెల్లుబాటు కాలేదన్నారు. సుమారు ఒక లక్ష 89 వేల ఓట్లు చెల్లుబాటు అయ్యాయని ఇంకా 40 వేల ఓట్లు ప్రాథమిక లెక్కింపు విభజన చేయాల్సి ఉందన్నారు. మంగళవారంఉదయం 10 గంటల నుంచి ప్రాధాన్యత ఓట్లను కౌంటింగ్ చేయనున్నట్లు తెలిపారు.

News March 4, 2025

MLC ఎన్నికల్లో తొలిసారి గెలవబోతున్న టీడీపీ అభ్యర్థి..!

image

గోదావరి గడ్డపై పట్టభద్రుల MLC స్థానంలో టీడీపీ నుంచి తొలివిజయం నమోదు కానుంది. 2007లో శాసనమండలి ఏర్పడ్డాక 2007, 2013, 2019 గ్రాడ్యుయేట్ MLC ఎన్నికల్లో టీడీపీ ఒక్కసారి కూడా గెలవలేదు. గోదావరి జిల్లాలో గత 3సార్లు పీడీఎఫ్ లేదా ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలుపొందారు. అలాంటి గోదావరి గడ్డపై రాజశేఖరం గెలుపు దాదాపు ఖరారైంది. 80వేల ఓట్లు మెజార్టీ సాధించే అవకాశం ఉంది. ప్రస్తుతం 41,153 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

error: Content is protected !!