News February 26, 2026
బాపట్ల: 40 బైకులు, 4 లీటర్ల నాటుసారా స్వాధీనం- ఎస్పీ

జిల్లాలో గురువారం కార్డెన్ సెర్చ్ నిర్వహించి 40 బైకులు, 4 లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ ఉమామహేశ్వర్ చెప్పారు. బాపట్ల డీఎస్పీ జగదీష్ నాయక్ ఆధ్వర్యంలో బాపట్ల సబ్ డివిజన్ పరిధిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించామన్నారు. జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలను అరికట్టడమే లక్ష్యంగా కార్డెన్ సర్చ్ నిర్వహించినట్లు తెలిపారు.
Similar News
News April 16, 2026
NZB: పసుపు రైతులకు మేలు చేకూర్చడమే ధ్యేయం: కలెక్టర్

పసుపు రైతుల ప్రయోజనాలను పరిరక్షిస్తూ, వారికి మేలు చేకూర్చడమే ధ్యేయంగా జిల్లా యంత్రాంగం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. రైతులకు గిట్టుబాటు ధర లభించాలనే ఉద్దేశంతో స్థానిక మార్కెట్ యార్డులో పసుపు అమ్మకాల్లో బహిరంగ వేలం విధానాన్ని అమలు చేయడం జరిగిందన్నారు. పసుపు క్వింటాకు సగటున రూ.16,000 ధర లభిస్తోందని తెలిపారు. రైతులు ఎలాంటి అపోహలకు గురి కాకూడదని సూచించారు.
News April 16, 2026
తెలంగాణ ఏర్పాటును పాకిస్థాన్‌తో పోల్చుస్తావా?.. హరీశ్‌రావు ఫైర్

పార్లమెంట్‌లో TG ఏర్పాటుపై BJP MP తేజస్వీ యాదవ్ చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘తెలంగాణ ఏర్పాటును పాకిస్థాన్‌తో పోలుస్తావా?, దశాబ్దాల పోరాటం, ఎంతో మంది త్యాగాల ఫలితమైన అలాంటి మహోద్యమాన్ని విద్వేషపూరిత విభజనతో పోల్చడం అమరుల త్యాగాలను తక్కువ చేసి చూపించడమే.. పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని అవమానించిన తేజస్వీ క్షమాపణలు చెప్పాలి’ అని ట్వీట్ చేశారు.
News April 16, 2026
ప.గో: ఏఆర్‌టీ కేంద్రాల్లో సిబ్బంది చేతివాటం

ఉమ్మడి ప.గో జిల్లాలోని ఏఆర్‌టీ కేంద్రాల్లో హెచ్‌ఐవీ బాధితులకు ఇబ్బందులు తప్పడం లేదు. జిల్లా వ్యాప్తంగా సుమారు 20 వేల మంది ప్రతి నెలా ఇక్కడ మందులు, కౌన్సెలింగ్ పొందుతున్నారు. అయితే, కొందరు సిబ్బంది వీరి నుంచి డబ్బులు డిమాండ్ చేస్తున్నారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. అడిగినవి ఇవ్వకపోతే మందులు వెంటనే ఇవ్వకుండా వేధిస్తున్నారని వాపోతున్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.


