News February 12, 2025

బాపట్ల: 87 ఏళ్ల వృద్ధాప్యంలో 156 పతకాలు

image

బాపట్ల పట్టణం భీమవారిపాలెం గ్రామానికి చెందిన వెంకట రామారావు 87 ఏళ్ల వయసులోనూ క్రీడలలో పతకాలు సాధించారు. రాజస్థాన్‌లో ఫిబ్రవరి 6, 7, 8 తేదీలలో జరిగిన అథ్లెటిక్స్‌లో జావెలిన్ త్రోలో బంగారు పతకం, డిస్కస్ త్రో, షాట్ పుట్‌లో కాంస్య పతకాలు సాధించినట్లు తెలిపారు. ఇప్పటివరకు ఆయన జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో  96 బంగారు, 40 సిల్వర్, 20 కాంస్య పతకాలు సాధించినట్లు తెలిపారు.

Similar News

News December 4, 2025

మలబద్ధకాన్ని నివారించాలంటే?

image

* టాయిలెట్ వచ్చినప్పుడు వెంటనే వెళ్లాలి. రోజూ ఒకే సమయాన్ని అనుసరించాలి.
* సాధ్యమైనంత వరకు ఇండియన్ టాయిలెట్లను ఉపయోగించండి. వాటిని వాడటంలో సమస్యలుంటే వెస్ట్రన్ టాయిలెట్ల ముందు పీఠను ఉపయోగించి మోకాళ్లను కాస్త పైకి ఉంచుకోవాలి. ఇది మల మార్గాన్ని సులభతరం చేస్తుంది.
* 5-10 ని.ల కంటే ఎక్కువ సేపు బాత్రూమ్‌లో ఉండొద్దు.
* ఫుడ్‌లో తగినంత ఫైబర్, సరిపడినన్ని నీళ్లు తీసుకోవాలి. తేలికపాటి వ్యాయామాలు చేయాలి.

News December 4, 2025

ఎక్సైజ్ సవరణ బిల్లుకు బీఆర్ఎస్ మద్దతు: వద్దిరాజు

image

మాజీ సీఎం కేసీఆర్ పదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అన్నారు. దేశ ఆర్థిక పురోగతికి విశేష కృషి చేశారని గురువారం పార్లమెంట్లో జరిగిన సెంట్రల్ ఎక్సైజ్ సవరణ బిల్లుపై మాట్లాడారు. సామాజిక కోణంలో కాకుండా ఆర్థిక సంబంధమైన ముఖ్యమైన అంశాలతో కూడిన ఈ బిల్లుకు తమ పార్టీ మద్దతునిస్తుందన్నారు. మద్యం దుకాణాల కేటాయింపుల్లో గౌడ కులస్తులకు 15% రిజర్వేషన్ ఇచ్చామన్నారు.

News December 4, 2025

సివిల్ సర్వీసులో విజయం సాధించాలి: భట్టి విక్రమార్క

image

రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం పథకం కింద సివిల్ సర్వీసెస్ మెయిన్స్ ఇంటర్వ్యూలకు ఎంతమంది ఎంపికైనా ఆర్థిక సాయం అందిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. గురువారం ప్రజా భవన్లో యూపీఎస్సీ ఇంటర్వ్యూకు ఎంపికైన 50 మందికి చెక్కులు అందించారు. సివిల్ సర్వీసుల్లో విజయం సాధించి రాష్ట్రానికి, దేశానికి సేవ చేయాలని తపిస్తున్న అందరికీ డిప్యూటీ సీఎం, సింగరేణి సీఎండీ బలరాం శుభాకాంక్షలు తెలిపారు.