News February 12, 2025
బాపట్ల: 87 ఏళ్ల వృద్ధాప్యంలో 156 పతకాలు

బాపట్ల పట్టణం భీమవారిపాలెం గ్రామానికి చెందిన వెంకట రామారావు 87 ఏళ్ల వయసులోనూ క్రీడలలో పతకాలు సాధించారు. రాజస్థాన్‌లో ఫిబ్రవరి 6, 7, 8 తేదీలలో జరిగిన అథ్లెటిక్స్‌లో జావెలిన్ త్రోలో బంగారు పతకం, డిస్కస్ త్రో, షాట్ పుట్‌లో కాంస్య పతకాలు సాధించినట్లు తెలిపారు. ఇప్పటివరకు ఆయన జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో 96 బంగారు, 40 సిల్వర్, 20 కాంస్య పతకాలు సాధించినట్లు తెలిపారు.
Similar News
News March 15, 2025
పది ఫలితాల్లో మెరుగైన ఫలితాలు సాధించాలి: జడ్పీ ఛైర్‌పర్సన్

ఈ నెల 17వ తేదీ నుంచి ప్రారంభం కానున్న పదవ తరగతి పరీక్షల్లో జిల్లా విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించి అగ్రస్థానంలో నిలవాలని కృష్ణాజిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఉప్పాల హారిక అధికారులకు సూచించారు. శనివారం జడ్పీ మీటింగ్ హాలులో 1 నుంచి 7 వరకు జడ్పీ స్థాయి సంఘ సమావేశాలు చైర్ పర్సన్ ఆధ్వర్యంలో జరిగాయి. తొలుత జడ్పీ చైర్ పర్సన్ జడ్పీటీసీలు, జిల్లా అధికారులచే స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞను చేయించారు.
News March 15, 2025
గ్రూప్ 2, 3 ఫలితాల్లో మంచిర్యాల యువకుడి సత్తా

గ్రూప్ 2,3 ఫలితాల్లో మంచిర్యాల ఆర్ఆర్ నగర్‌కు చెందిన మండల సుమంత్ గౌడ్ సత్తా చాటారు. శుక్రవారం విడుదలైన గ్రూప్ 3 ఫలితాల్లో 102వ ర్యాంకు సాధించారు. కాగా గతంలో విడుదలైన గ్రూప్ 2 ఫలితాల్లో 172 ర్యాంకు సాధించడం విశేషం. ప్రస్తుతం హైదరాబాద్ జీహెచ్ఎంసీలో జూనియర్ అసిస్టెంట్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. దీంతో ఆయన్ను పలువురు అభినందించారు.
News March 15, 2025
VZM: ఈనెల 16న FRO ఉద్యోగాలకు రాతపరీక్ష

ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ ఉద్యోగాల భర్తీకి ఈ నెల 16న జరిగే రాతపరీక్షకు పకడ్బంధీగా ఏర్పాట్లు చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎస్.శ్రీనివాసమూర్తి ఆదేశించారు. పట్టణంలోని తమ ఛాంబర్లో శనివారం సమావేశాన్ని నిర్వహించారు. ఈ పరీక్షలు ఉదయం 9.30 నుంచి 12 గంటలు వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటలు వరకు జరుగుతాయని చెప్పారు. రెండు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.