News February 2, 2025
బాపట్ల: PGRS కార్యక్రమం రద్దు

‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. బాపట్ల జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ప్రతి సోమవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించే ఈ కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. అర్జీదారులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.
Similar News
News November 23, 2025
మహబూబాబాద్ బిడ్డకు గోల్డ్ మెడల్

మహబూబాబాద్ జిల్లా కురవి మండలం జాటోత్ తండాకు చెందిన క్రీడాకారిణి గుగులోతు ప్రియ ఒడిశాలో జరిగిన ఈఎంఆర్ఎస్ 4వ జాతీయ టైక్వాండో పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించింది. పలు రాష్ట్రాల నుంచి వచ్చి పోటీ పడిన క్రీడాకారులను ఎదుర్కొని స్వర్ణ పతకంతో రాష్ట్రానికి పేరు తెచ్చిన ప్రియను సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. ఆమెకు ప్రశంసా పత్రాన్ని అందజేసిన సీఎం.. భవిష్యత్తులో మరిన్ని పథకాలను సాధించాలని ప్రోత్సహించారు.
News November 23, 2025
సిద్దిపేట: 25న వాడిన సామాగ్రి వేలంపాట

వాడిన ఎలక్ట్రిక్, ఎలక్ట్రానిక్ వస్తువులు, బ్యాటరీలు, టెంట్లు ఇతర సామాగ్రికి 25న జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ (పెద్ద కోడూరు శివారు)లో వేలంపాట వేస్తున్నట్టు సీపీ విజయ్ కుమార్ పేర్కొన్నారు. ఉదయం 10 గంటలకు వేలం పాట ప్రారంభమవుతుందని తెలిపారు. వేలం పాటలో పాల్గొనాలని ఆసక్తి ఉన్నవారు వేలంపాట ప్రదేశానికి వచ్చి పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. సందేహాలకు 87126 67416, 87126 67422 సంప్రదించాలన్నారు.
News November 23, 2025
సిద్దిపేట: మొదటి మహిళా డీసీసీ అధ్యక్షురాలిగా ఆంక్షారెడ్డి

2014లో సిద్దిపేట జిల్లా ఏర్పడిన తర్వాత మూడు సార్లు డీసీసీ కమిటీ ఏర్పడింది. అందులో మొదటి, 2వ సారి తూంకుంట నర్సారెడ్డి డీసీసీ అధ్యక్షుడిగా వ్యవహారించారు. 3వసారి ఆయన కూతురైన ఆంక్షారెడ్డి నియామకమయ్యారు. ఒక ఫ్యామిలీ నుంచి మూడు సార్లు ఈ పదవి పొందడం గమనార్హం. జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న గ్రూపు తగాదాలను ఆమె ఎలా పరిష్కరిస్తారో చూడాలి మరి!


