News March 10, 2025

బాపులపాడులో అధిక ఉష్ణోగ్రతలు.. తగ్గని వేడి.!

image

కృష్ణా జిల్లా గన్నవరం, బాపులపాడు, ఉంగుటూరు మండలాల్లో నేడు బయట ఎండ తీవ్రత కనిపించకపోయినా, ఉష్ణోగ్రతలు మాత్రం తగ్గలేదు. బాపులపాడు, ఉంగుటూరు మండలాల్లో 35 డిగ్రీలు, గన్నవరంలో 36 డిగ్రీలు నమోదయ్యాయి. పైగా గాలిలేని వాతావరణం ఉక్కపోతను మరింత పెంచింది. “గాలి లేక అసలే ఉమ్మటేసింది!” అని స్థానికులు అంటున్నారు. 

Similar News

News March 10, 2025

MTM: ప్రజల అర్జీల పట్ల శ్రద్ధ వహించాలి- కలెక్టర్

image

ప్రజల నుంచి అందే అర్జీల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి సకాలంలో సానుకూలంగా పరిష్కరించాలని కలెక్టర్ డీకే బాలాజీ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టరెట్ ప్రాంగణంలో నిర్వహించిన మీకోసం కార్యక్రమంలో కలెక్టర్ ప్రజల సమస్యలను అర్జీల రూపంలో స్వీకరించారు. అనంతరం సంబంధిత అధికారులను వాటిని సకాలంలో పరిష్కరించాలని సూచించారు.

News March 10, 2025

గన్నవరం: వంశీ బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా

image

విజయవాడ ఎస్సీ, ఎస్టీ కోర్టులో వంశీ బెయిల్ పిటిషన్‌పై సోమవారం విచారణ జరిగింది. ప్రభుత్వ తరఫు న్యాయవాది సత్యవర్ధన్ కౌంటర్ దాఖలుకు రెండు రోజులు సమయం కోరారు. దీంతో విజయవాడ ఎస్సీ, ఎస్టీ కోర్టు తదుపరి విచారణను వాయిదా వేసింది. గన్నవరం టీడీపీ ఆఫీస్ దాడి కేసులో ఏ71గా వల్లభనేని వంశీ ఉన్నారు. ఇటీవల నియోజకవర్గ వ్యాప్తంగా ఆయనపై పలు కేసులు నమోదయ్యాయి. 

News March 10, 2025

కృష్ణా జిల్లాలో రాత్రి గస్తీ కట్టుదిట్టం 

image

కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్. గంగాధర రావు ఐపీఎస్ ఆదేశాలతో ఆదివారం రాత్రి గస్తీ పటిష్ఠంగా కొనసాగుతోంది. నేర నియంత్రణ, దొంగతనాలు, అసాంఘిక కార్యకలాపాలను అడ్డుకునేందుకు అనుమానిత వాహనాలు, ప్రయాణికుల తనిఖీ, సీసీ కెమెరాల పర్యవేక్షణ చేపట్టారు. హైవేలపై డ్రైవర్లకు అవగాహన కల్పించి, బస్టాండ్లు, లాడ్జిలలో కొత్త వారి వివరాలు సేకరిస్తున్నారు. 

error: Content is protected !!