News March 10, 2025

బాపులపాడులో అధిక ఉష్ణోగ్రతలు.. తగ్గని వేడి.!

image

కృష్ణా జిల్లా గన్నవరం, బాపులపాడు, ఉంగుటూరు మండలాల్లో నేడు బయట ఎండ తీవ్రత కనిపించకపోయినా, ఉష్ణోగ్రతలు మాత్రం తగ్గలేదు. బాపులపాడు, ఉంగుటూరు మండలాల్లో 35 డిగ్రీలు, గన్నవరంలో 36 డిగ్రీలు నమోదయ్యాయి. పైగా గాలిలేని వాతావరణం ఉక్కపోతను మరింత పెంచింది. “గాలి లేక అసలే ఉమ్మటేసింది!” అని స్థానికులు అంటున్నారు. 

Similar News

News March 26, 2025

కృష్ణా: పొట్టిపాడు టోల్ గేట్ వద్ద గంజాయి పట్టివేత 

image

ఉంగుటూరు మండలం పొట్టిపాడు టోల్ గేట్ వద్ద పోలీసులు భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. బుధవారం అనకాపల్లి నుంచి సూర్యాపేట వెళ్తున్న కారును తనిఖీ చేయగా, 62 కేజీల గంజాయి ఉన్నట్లు గుర్తించారు. ఈ ఘటనలో భాస్కర్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనిపై కేసు నమోదు చేసి స్థానిక పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. 

News March 26, 2025

మూడో స్థానంలో కృష్ణా జిల్లా

image

కృష్ణా జిల్లా ఆర్థిక వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ. 87,742 కోట్లు జీడీడీపీ నమోదు చేయగా, గత రెండేళ్లతో పోల్చితే 11.58% వృద్ధి సాధించింది. వ్యవసాయ, పారిశ్రామిక, సేవారంగాల్లో నిలకడగా ఎదుగుతోంది. మాంసం, రొయ్యల ఉత్పత్తి, మైనింగ్, విద్యుత్, రియల్ ఎస్టేట్ రంగాల్లోనూ మెరుగైన ప్రగతి కనబరిచింది. స్తుల దేశీయోత్పత్తిలో రాష్ట్రంలో కృష్ణాజిల్లా మూడో స్థానంలో నిలిచింది.

News March 26, 2025

పామర్రు మహిళను హత్య చేసింది వీరే.!

image

తాడేపల్లి పరిధి కొలనుకొండ శివారులో పామర్రుకు చెందిన మహిళను హత్య చేసిన ఘటనలో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు మంగళగిరి డీఎస్పీ మురళీకృష్ణ తెలిపారు. మంగళవారం స్టేషన్‌లో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ముత్యాల కోమల్ కుమార్, బత్తుల శశి అలియాస్ జెస్సీ ఇద్దరు పథకం ప్రకారం మహిళను హత్య చేసినట్లు దర్యాప్తులో తేలిందన్నారు. 36 గంటల్లో కేసును చేధించిన తాడేపల్లి పోలీసులను SP అభినందించారు. 

error: Content is protected !!