News February 25, 2026
బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్‌లో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (BARC)లో 21 పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. పోస్టును బట్టి MBBS, MD, DM, DNB, MS, పీజీ డిప్లొమా, DMRIT, DNMT, DFIT, MSc(న్యూక్లియర్ మెడిసిన్) అర్హతతో పాటు పని అనుభవం గలవారు అప్లై చేసుకోవచ్చు. పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://barc.gov.in.
Similar News
News April 15, 2026
ప.గో: ప్రేమ విఫలమై యువకుడు సూసైడ్!

భీమవరం కొత్త బస్టాండ్ వద్ద కృష్ణా జిల్లా బంటుమిల్లి(M) మల్లిపూడికి చెందిన రాజేశ్(23) ఈనెల 3వ తేదీన గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. గమనించిన స్థానికులు 108 వాహనంలో ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం విజయవాడ తరలించగా ఈనెల 13న మృతి చెందారు. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రేమ విఫలం కావడమే ఆత్మహత్యకు కారణమని తెలిపారు.
News April 15, 2026
మరింత పెరగనున్న వాహనాల ధరలు?

నిర్వహణ ఖర్చులు పెరిగాయంటూ ఇప్పటికే ఆటోమొబైల్ కంపెనీలు వాహనాల ధరలు పెంచుతున్నాయి. యుద్ధం మరింత కాలం కొనసాగితే ఉత్పత్తి వ్యయం పరిమితికి మించి పెరిగి రేట్లు మరింత పెంచాల్సి రావొచ్చని భారత వాహన తయారీదారుల సమాఖ్య(సియామ్) అధ్యక్షుడు శైలేశ్ చంద్ర తెలిపారు. కమోడిటీ ధరలు ఏమేర పెరుగుతాయనేది 4-5 వారాల్లో స్పష్టత రావొచ్చన్నారు. ఆ తర్వాతే వాహనాల రేట్ల పెంపుపై నిర్ణయం తీసుకోవడానికి వీలవుతుందని వెల్లడించారు.
News April 15, 2026
US-ఇరాన్ చర్చలపై వాన్స్ కీలక వ్యాఖ్యలు

అమెరికా, ఇరాన్ మధ్య దశాబ్దాలుగా నమ్మకం లేకపోవడమే పెద్ద అడ్డంకి అని JD వాన్స్ అభిప్రాయపడ్డారు. దాన్ని తొలగించడం అంత సులభం కాదని పేర్కొన్నారు. ప్రస్తుతం అమల్లో ఉన్న సీజ్‌ఫైర్‌ను పూర్తిస్థాయి శాంతి ఒప్పందంగా మార్చడం పెద్ద ఛాలెంజ్ అన్నారు. ఏళ్ల తరబడిగా ఉన్న విభేదాలు ఒక్క రాత్రిలో పరిష్కారం కావని స్పష్టం చేశారు. మరోసారి ఇరుపక్షాలు చర్చలకు సిద్ధమవుతున్న తరుణంలో వాన్స్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.


