News March 1, 2025
బాబోయే.. మండుతున్న ఎండలు

వికారాబాద్ జిల్లాలో రోజురోజుకు ఎండలు దంచికొడుతున్నాయి. పరిగి మండలంలో నిన్న 34 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పుడే ఇలా ఉంటే మనుముందు పరిస్థితి ఎలా ఉంటుందో అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఎండల నేపథ్యంలో భయటకు వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలని, చిన్న పిల్లలు, వృద్దులు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు చెబుతున్నారు.
Similar News
News October 20, 2025
భారీ లాభాల్లో మొదలైన స్టాక్ మార్కెట్లు

భారత స్టాక్ మార్కెట్లు దీపావళి వేళ భారీ లాభాల్లో మొదలయ్యాయి. సెన్సెక్స్ 549 పాయింట్ల లాభంతో 84,501, నిఫ్టీ 159 పాయింట్ల లాభంతో 25,869 వద్ద స్టార్ట్ అయ్యాయి. ప్రస్తుతం రిలయన్స్, అపోలో హాస్పిటల్స్, శ్రీరామ్ ఫైనాన్స్, HDFC బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ టాప్ గెయినర్స్ కాగా ICICI బ్యాంక్, JSW స్టీల్, టాటా స్టీల్, టెక్ మహీంద్రా, ONGC టాప్ లూజర్స్.
News October 20, 2025
వనపర్తి: దీపావళి.. ఎస్పీ కీలక సూచనలు

✓ పిల్లలను పెద్దల పర్యవేక్షణలోనే టపాసులు కాల్చనివ్వాలి.
✓ రహదారులపై లేదా ఇళ్ల ముందు గుంపులుగా టపాసులు కాల్చవద్దు.
✓ టపాసులు వెలిగించిన వెంటనే దూరంగా నిలబడాలి.
✓ వెలగని టపాసులను మళ్లీ వెలిగించకూడదు.
✓ నీరు, ఇసుక బకెట్ దగ్గర ఉంచుకోవాలి.
✓ టపాసుల గోదాములు, విక్రయ కేంద్రాలు భద్రతా నిబంధనలు తప్పక పాటించాలి.
✓ అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు వెంటనే డయల్ 100 లేదా 101 నంబర్లకు సమాచారం ఇవ్వాలి.
News October 20, 2025
వనపర్తి: ఆనందోత్సాహాలతో దీపావలి జరుపుకోవాలి: కలెక్టర్

దీపావళి పర్వదినాన్ని వనపర్తి జిల్లాలోని ప్రజలందరూ ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని, ప్రతి ఇంటిలో ఆనందం, ఐకమత్యం, సంతోషం నిండాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆకాంక్షించారు. దీపావళి పండుగ అంటే దుష్టశక్తులపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా పండుగను జరుపుతామన్నారు. అలాగే బాణసంచా విషయంలో పిల్లల పట్ల పెద్దలు అప్రమత్తత వహించాలన్నారు.