News March 20, 2025
బాలం రాయి హై స్కూల్‌ను సందర్శించిన మంత్రి, కలెక్టర్

విద్యారంగం ప్రాముఖ్యతను గుర్తించి ప్రభుత్వం విద్యపై ప్రత్యేక దృష్టి సారించిందని HYD ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సికింద్రాబాద్ నల్లగుట్ట బాలంరాయి హైస్కూల్లో ఎఫ్ఎల్ఎన్, ఏఎక్సెల్ ఏఐ ఆధారిత కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్‌లను కలెక్టర్‌తో కలసి పరిశీలించారు. పదో తరగతి పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించాలని విద్యార్థులకు సూచించారు. కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, DEO ఉన్నారు.
Similar News
News December 1, 2025
పాతబస్తీలో అండర్‌గ్రౌండ్ సర్జరీ!

మెట్రో రైలు ఫేజ్-II (MGBS-చాంద్రాయణగుట్ట) కారిడార్‌లో పాతబస్తీకి శాశ్వత పరిష్కారం దక్కనుంది. కేవలం ఆరు నెలల్లోనే రూ.39.6 కోట్లతో కీలక జల వసతి పనులు పూర్తి చేయాలని HMWSSB నిర్ణయించింది. మైసారం, అలియాబాద్, మిస్రిగంజ్, దారుల్షిఫా, మొఘల్‌పురా, జంగంమెట్, గౌలిపురా, ఎంఆర్జీ ప్రాంతాల మీదుగా ఉన్న 100-1200 mm డయా తాగునీరు, డ్రైనేజీ లైన్లను మెట్రో పిల్లర్ల మార్గం నుంచి పూర్తిస్థాయిలో మార్చనున్నారు.
News December 1, 2025
హైదరాబాద్ శివారు రోడ్లకు మహర్దశ

HYD శివారు రోడ్ల విస్తరణ కోసం ప్రభుత్వం రూ.390కోట్ల భారీ ప్రాజెక్టును ప్రకటించింది. 148.85 కి.మీ. మేర రోడ్లను అద్భుతంగా తీర్చిదిద్దడానికి టెండర్లు పిలిచింది. HAM పద్ధతిలో ప్రాజెక్టును చేపడుతున్నారు. దీని ప్రకారం, ప్రాజెక్టు నిర్మాణ వ్యయంలో కొంత భాగాన్ని ప్రభుత్వం నేరుగా భరిస్తుంది. ఈప్రాజెక్టును (PPP) ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యాంతో చేపట్టనున్నట్లు అధికారులు Way2Newsకు తెలిపారు.
News December 1, 2025
HYD: కరెంటు బిల్లే క్రెడిట్ స్కోరు.!

‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’లో ప్రభుత్వం కీలక ఆర్థిక సంస్కరణను ప్రకటించనుంది. ‘రుణ చరిత్ర లేని’ ప్రజల కోసం తెలంగాణ ఇన్ఫర్మేషన్ బ్యూరో (TIB) ఏర్పాటు కానుంది. ఈ సంస్థ కరెంటు బిల్లులు, ఇంటి పన్నులు వంటి చెల్లింపుల రికార్డులను పరిశీలించి ‘ఆల్టర్నేటివ్ క్రెడిట్ స్కోరు’ను ఇస్తుంది. ఈ స్కోరు ఆధారంగా బ్యాంకులు లక్షలాది మందికి రుణాలు అందించే అవకాశం ఉందని అధికారులు Way2Newsకు తెలిపారు.


