News January 26, 2025

బాలకృష్ణకు మంత్రి అభినందనలు 

image

బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అన్నమయ్య జిల్లాకు చెందిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి హైదరాబాద్‌లో బాలకృష్ణను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. మంత్రి మాట్లాడుతూ.. దశాబ్దాలుగా తన నటనతో కోట్లాది మంది ప్రేక్షకులను ఆకట్టుకుని వారి అభిమానాన్ని సొంతం చేసుకున్నారని కొనియాడారు.

Similar News

News December 4, 2025

గోదావరిఖని డిపో DEC టూర్ ప్యాకేజీలు

image

GDK డిపో DECలో 2 ప్రత్యేక టూర్ ప్యాకేజీలను ప్రకటించింది. DEC 6న బయలుదేరే కర్ణాటక యాత్రలో హంపి-గోకర్ణ-మురుడేశ్వర-ఉడిపి-శృంగేరి-ధర్మస్థల-కుక్కి సుబ్రమణ్య-మంత్రాలయం దర్శనాలు ఉంటాయి. ఛార్జీలు: పెద్దలు రూ.6600, పిల్లలు రూ.5000. DEC 15న అరుణాచలం- రామేశ్వరం యాత్ర ఉంటుంది. ఇందులో కాణిపాకం- అరుణాచలం- శ్రీరంగం- పలని- మధురై- రామేశ్వరం సహా 10 ముఖ్యక్షేత్రాలు ఉంటాయి. ఛార్జీలు: పెద్దలు రూ.8000, పిల్లలు రూ.6000.

News December 4, 2025

చెల్పూర్, గొర్లవీడు సర్పంచుల బరిలో తాజా మాజీ ఎంపీపీలు..!

image

జయశంకర్ జిల్లాలో తాజా మాజీ ఎంపీపీలు ఇరువురు సర్పంచ్ బరిలో నిలిచారు. గణపురం మండల తాజా మాజీ ఎంపీపీ కావటి రజిత చెల్పూరు సర్పంచ్, భూపాలపల్లి తాజా మాజీ ఎంపీపీ మందల లావణ్య రెడ్డి గొర్లవీడు సర్పంచ్ బరిలో నిలిచారు. వీరిరువురు మండల స్థాయిలో ఎంపీపీలుగా పనిచేసి జనరల్ మహిళల రిజర్వేషన్ల రావడంతో వారి సొంత గ్రామాల్లో పోటీకి నిలిచారు. అందులో రజిత అధికార కాంగ్రెస్, లావణ్య ప్రతిపక్ష బీఆర్ఎస్‌లో ఉన్నారు.

News December 4, 2025

ఉప్పాడ మత్స్యకారులను ఆదుకుంటాం: పవన్

image

AP: కాకినాడ(D) ఉప్పాడ మత్స్యకారులను ఆదుకుంటామని వారితో సమావేశం సందర్భంగా Dy.CM పవన్ అన్నారు. ‘సముద్ర జలాల కాలుష్య సమస్యపై శాస్త్రీయ పరిశోధన చేస్తాం. జాలర్ల ఆదాయం పెంపు, మత్స్య సంపద వృద్ధి, తీర ప్రాంత రక్షణ, యువత, మహిళలకు ఉపాధి కల్పన లక్ష్యంగా యాక్షన్ ప్లాన్ రూపొందిస్తున్నాం. గత ప్రభుత్వ తప్పిదాలతో ప్రజాధనం వృథా అయింది. చేసిన పనులే చేయాల్సిన దుస్థితిని అప్పటి పాలకులు తెచ్చారు’ అని ఆరోపించారు.