News January 26, 2025
బాలకృష్ణకు మంత్రి అభినందనలు

బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అన్నమయ్య జిల్లాకు చెందిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి హైదరాబాద్‌లో బాలకృష్ణను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. మంత్రి మాట్లాడుతూ.. దశాబ్దాలుగా తన నటనతో కోట్లాది మంది ప్రేక్షకులను ఆకట్టుకుని వారి అభిమానాన్ని సొంతం చేసుకున్నారని కొనియాడారు.
Similar News
News February 7, 2025
రెండు రోజులు స్కూళ్లకు సెలవులు!

ఈనెల 26న శివరాత్రి కావడంతో స్కూళ్లకు పబ్లిక్ హాలిడే ఉంది. అలాగే పలు జిల్లాల్లో 27న కూడా సెలవు ఉండనుంది. ఆరోజు TGలో ఒక గ్రాడ్యుయేట్, 2 టీచర్ MLC, APలో 2 గ్రాడ్యుయేట్, ఒక టీచర్ MLC స్థానాలకు పోలింగ్ జరగనుంది. APలో శ్రీకాకుళం, విజయనగరం, VZG, ఉ.గోదావరి, కృష్ణా, GTR, TGలో MDK, NZB, ADB, KNR, WGL, KMM, NLGలో టీచర్లు ఓటు వేయనుండటంతో అక్కడ స్కూళ్లకు సెలవు ఇవ్వనున్నారు. త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుంది.
News February 7, 2025
ప్రత్యేక తరగతులు పక్కడ్బందీగా నిర్వహించాలి: DEO

జిల్లాలో పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు పక్కడ్బందీగా నిర్వహించాలని సంగారెడ్డి డీఈవో వెంకటేశ్వర్లు ఆదేశించారు. ఉదయం 8:15 నుంచి 9:15 వరకు, సాయంత్రం 4:15 నుంచి 5:15 వరకు తరగతులు నిర్వహించాలని చెప్పారు. సాయంత్రం అల్పాహారం అందించాలని పేర్కొన్నారు. ప్రత్యేక తరగతులు నిర్వహించడంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News February 7, 2025
MLC ఎన్నికల బరిలో నలుగురు జన్నారం వాసులు

పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలో జన్నారం మండలానికి చెందిన నలుగురు నిలిచారు. మండలంలోని కలమడుగు గ్రామానికి చెందిన ట్రస్మా అధ్యక్షుడు యాదగిరి శేఖర్ రావు, చింతగూడకు చెందిన మేకల అక్షయ్ కుమార్, దేవుని గూడెం గ్రామానికి చెందిన గవ్వల శ్రీకాంత్, ఆయన భార్య గవ్వల లక్ష్మి శ్రీకాంత్ ఇప్పటికే నామినేషన్లు దాఖలు చేశారు. మండలానికి చెందిన మరి కొంతమంది ఎమ్మెల్సీ అభ్యర్థులుగా నామినేషన్లు వేసే అవకాశముంది.