News June 1, 2024

బాలకృష్ణ భారీ మెజార్టీ.. ఉషశ్రీ, గుమ్మనూరు ఓటమి: ఆరా మస్తాన్

image

ఉమ్మడి అనంతపురం జిల్లాలో హిందూపురం ఎమ్మెల్యే అభ్యర్థి భారీ మెజార్టీతో గెలుస్తారని ఆరా మస్తాన్ తన సర్వేలో ఫలితాన్ని ప్రకటించారు. అలాగే పెనుకొండ వైసీపీ అభ్యర్థి ఉషశ్రీ చరణ్ స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి, గుంతకల్లు టీడీపీ అభ్యర్థి గుమ్మనూరు జయరాం ఓడిపోతారని వెల్లడించింది.

Similar News

News September 18, 2024

బెంగళూరు-ధర్మవరం ప్యాసింజర్ రైలు అనంతపురం వరకు పొడిగింపు

image

బెంగళూరు నుంచి ధర్మవరం వరకు నడుస్తున్న 06515/06516 ప్యాసింజర్ రైలును అనంతపురం వరకు పొడిగిస్తూ సౌత్ వెస్ట్రన్ రైల్వే అధికారి బీఎస్ క్రిస్టోఫర్ ఆదేశాలు జారీచేశారు. సత్యసాయి ప్రశాంతి నిలయం, ధర్మవరం మీదుగా అనంతపురం వెళ్తుందని తెలిపారు. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ వినతి మేరకు పొడిగించినట్లు తెలిపారు.

News September 18, 2024

జిల్లా దేశంలోనే ప్రథమ స్థానంలో ఉండటానికి చర్యలు తీసుకోవాలి: కలెక్టర్

image

అనంతపురం జిల్లాను దేశంలో ప్రథమ స్థానంలో ఉండటానికి కావలిసిన అని చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ సూచించారు. మంగళవారం అనంతపురం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో ఏపీఎంఐపీ పథకం పైన సమీక్షసమావేశం నిర్వహించార. రాష్ట్ర స్థాయి డ్రిప్ కంపెనీ ప్రతినిధులు, జిల్లా వ్యవసాయ, మైక్రో ఇరిగేషన్, ఉద్యానవన, పట్టు పరిశ్రమ తదితరులతో నిర్వహించారు.

News September 18, 2024

అనంత: మామిడి చెట్టుకు ఉరివేసుకుని రైతు ఆత్మహత్య

image

అనంతపురం జిల్లాలో రైతు మామిడి చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. తాడిపత్రి మండల పరిధిలోని అయ్యవారిపల్లిలో రైతు అమరేశ్ రెండెకరాలలో మొక్కజొన్న పంటను సాగు చేశాడు. అయితే పెట్టిన పెట్టుబడులు సరిగా రాకపోవడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఘటనపై తాడిపత్రి రూరల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.