News November 13, 2024
బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి పొన్నం ప్రభాకర్
భారత తొలి ప్రధాని చాచా నెహ్రూ జన్మదినం సందర్భంగా బాలలందరికి రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పిల్లలను జాతి సంపదగా భావించి వారి భవితవ్యానికి, అభివృద్ధికి నెహ్రూ కృషి చేశారని మంత్రి పునరుద్ఘాటించారు. బాలలు తల్లిదండ్రుల కలల ప్రతిరూపాలు అని, భావి భారత పౌరులని వారికి విద్యతో పాటు మంచి విలువలను నేర్పాలని ఆకాంక్షించారు.
Similar News
News December 13, 2024
మల్యాల: వ్యక్తి సజీవ దహనం.. UPDATE
షార్ట్ సర్క్యూట్‌తో నిన్న మల్యాల మండలంలో వ్యక్తి <<14855286>>సజీవ <<>>దహనమైన విషయం తెలిసిందే. పోలీసుల వివరాల ప్రకారం.. మ్యాడంపల్లి గ్రామానికి చెందిన తిరుపతి(40) ట్రాక్టర్ డ్రైవర్, భార్య సౌందర్య హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. బుధవారం అర్ధరాత్రి షార్ట్ సర్క్యూట్‌తో ఇంట్లో మంటలు చెలరేగాయి. స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అప్పటికే తిరుపతి మంటలకు ఆహుతి అయ్యాడు.
News December 12, 2024
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్
@ మల్యాల మండలంలో షార్ట్ సర్క్యూట్‌తో వ్యక్తి సజీవ దహనం.
@ ఇబ్రహీంపట్నం, మెట్పల్లి మండలాల్లో ఇందిరమ్మ ఇండ్ల సర్వేను పరిశీలించిన జగిత్యాల కలెక్టర్.
@ వెల్లుల్ల ఎల్లమ్మ ఆలయాన్ని ఎండోమెంట్ చేయవద్దని మెట్పల్లిలో ధర్నా.
@ లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ అవార్డు అందుకున్న కోరుట్ల చిన్నారి.
@ కోరుట్ల పట్టణంలో జర్నలిస్టుల ధర్నా.
News December 12, 2024
KNR: నూతన డైట్ మెనూ ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్
కరీంనగర్ జిల్లాలోని అన్ని సంక్షేమ హాస్టళ్లలో నూతన డైట్ మెనూ అమలు ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ కార్యాలయంలో సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం గురుకుల హాస్టల్ విద్యార్థులకు 40% డైట్ ఛార్జీలను పెంచిందన్నారు.