News June 21, 2024

బాలల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలి: RJD

image

బాలల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలని మహిళా శిశు సంక్షేమ శాఖ రీజనల్ జాయింట్ డైరెక్టర్ మోతి పేర్కొన్నారు. గురువారం సంగారెడ్డిలోని బాల రక్షాబంధన్‌ను ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బాలల హక్కుల రక్షణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. అంగన్వాడి కేంద్రాల ద్వారా ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Similar News

News September 17, 2024

సంగారెడ్డి: 1200 మంది పోలీసులతో బందోబస్తు

image

సంగారెడ్డి జిల్లాలో ఈనెల 17న జరిగే వినాయక నిమజ్జనానికి 1200 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ రూపేష్ సోమవారం తెలిపారు. నిమజ్జనాన్ని చూసేందుకు వచ్చే ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండేందుకు ప్రధాన కూడళ్ల వద్ద పికెట్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వినాయక మండప నిర్వాహకులు పోలీసులకు సహకరించాలని కోరారు. డీఎస్పీల పర్యవేక్షణలో నిమజ్జన కార్యక్రమాలు జరుగుతాయని చెప్పారు.

News September 16, 2024

సంగారెడ్డి: రికార్డు ధర పలికిన గణపతి లడ్డూలు

image

వాడవాడలా వినాయక నవరాత్రి వేడుకలు ఘనంగా జరగుతున్నాయి. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలంలో గణపతి లడ్డూ రికార్డు ధర పలికింది. కానుగుంటలో శ్రీఏకశిలా వరసద్ధి వినయాక దేవాలయంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సోమవారం లడ్డూ వేలం పాట నిర్వహించగా రికార్డు స్థాయిలో రూ.2.02 లక్షలు పలికింది. గోవర్ధన్ రెడ్డి లడ్డూని దక్కించుకోగా.. మరో లడ్డూను రూ. 80 వేలకు విశాల్ గౌడ్ దక్కించుకున్నారు.

News September 16, 2024

గుండెపోటుతో టీచర్ మృతి.. నేత్రదానం

image

సిద్దిపేట జిల్లా గజ్వేల్ మోడల్ స్కూల్ పాఠశాలలో హిందీ ఉపాధ్యాయుడు ధ్యాప వెంకటస్వామి(49) ఈ ఉదయం గుండెపోటుతో మరణించారు. మృతుడి స్వస్థలం జగదేవ్పూర్ మండలం అలిరాజపేట గ్రామం. అతడికి భార్య, ఇద్దరు ఆడపిల్లలు, వయస్సు మీద పడిన తల్లిదండ్రులు ఉన్నారు. వెంకట్ అకాల మరణంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పుట్టెడు దు:ఖంలోనూ నేత్రదానానికి ఆ కుటుంబీకులు ముందుకొచ్చి మరో ఇద్దరికి చూపు ఇచ్చారని మిత్రబృందం తెలిపింది.