News February 24, 2025

బాలానగర్‌: అక్కతో గొడవ.. చెల్లి SUICIDE

image

ఉరేసుకుని నర్సింగ్ <<15558418>>విద్యార్థి <<>>ఆత్మహత్య చేసుకుని మృతిచెందిన విషయం తెలిసిందే. కుటుంబీకుల వివరాల ప్రకారం.. ఫరూక్ నగర్ మండలంలోని రామేశ్వరం గ్రామానికి చెందిన కృష్ణయ్య చిన్నకూతురు సింధు(17) షాద్‌నగర్‌లో నర్సింగ్ చదువుతోంది. కాగా, ఆదివారం రెండో అక్కతో సింధుకి గొడవైంది. ఈ క్రమంలో క్షణికావేశంలో ఇంట్లో ఉరేసుకుంది. గమనించిన కుటుంబసభ్యులు పరిశీలించగా అప్పటికే చనిపోయింది. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.

Similar News

News February 24, 2025

మహబూబ్‌నగర్ కలెక్టర్ కీలక సూచన

image

MBNR జిల్లా వ్యాప్తంగా ఆర్థిక వారోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ విజయేంద్ర బోయి తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాల పోస్టర్‌ను ఆమె ఆవిష్కరించారు. ప్రజల్లో ఆర్థిక అవగాహన కల్పించేందుకు ఈ వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. రుణాలను ప్రభుత్వ సంస్థల ద్వారానే తీసుకోవాలని, ప్రవేట్ సంస్థల్లో తీసుకొని అధిక వడ్డీ బారిన పడకుండా జాగ్రత్త పడాలని కలెక్టర్ సూచించారు.

News February 24, 2025

ఉండవెల్లి: ఉరేసుకుని యువకుడి సూసైడ్

image

ఉరేసుకుని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల వివరాలు.. ఉండవెల్లి మండలం తక్కశీల గ్రామానికి చెందిన అనిల్ కుమార్ మద్యానికి బానిసై చదువు ఆపేశాడు. రోజు పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఈ క్రమంలో శనివారం సాయంత్రం మద్యం కోసం తల్లి జయమ్మను డబ్బులు అడగగా ఆమె మందలించింది. కోపోద్రిక్తుడైన అనిల్‌కుమార్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకున్నాడు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.

News February 24, 2025

BREAKING: మహబూబ్‌నగర్: ప్రైవేట్ బస్సు దగ్ధం

image

మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం మల్లెబోయినపల్లి వద్ద ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేట్ బస్సు వెనుక టైరు పగిలి మంటలు అంటున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలార్పేశారు. కాగా, బస్సులో ఉన్న వారు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనలో బస్సు దగ్ధం అయింది.

error: Content is protected !!